News October 7, 2025
గుండెపోటుకు ముందు కనిపించే లక్షణాలివే..

ప్రస్తుతకాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరికీ హార్ట్‌అటాక్ వస్తోంది. అయితే మహిళలకు ఈ ప్రమాదం ఎక్కువంటున్నారు నిపుణులు. గుండెపోటు వచ్చే ముందు మహిళల్లో ఛాతీలో అసౌకర్యం, భుజాలు, వీపు, మెడ, దవడ ప్రాంతాల్లో నొప్పి, శ్వాస సరిగా ఆడకపోవడం, తలతిరగడం, చెమట ఎక్కువగాపట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. <<-se>>#WomenHealth<<>>
Similar News
News March 25, 2026
మహిళల్లో ఈస్ట్రోజన్ తగ్గితే.. ఈ ఫుడ్ తీసుకోండి

అవయవాల పనితీరును సమన్వయపరిచే హార్మోన్లలో ఈస్ట్రోజన్ ఒకటి. ఇది తగ్గడం వల్ల మహిళల్లో నెలసరి అస్తవ్యస్తం, మూడ్ స్వింగ్స్, డిప్రెషన్, తలనొప్పి, చర్మం పొడిబారడం, అధికబరువు వంటి సమస్యలు వస్తాయి. ఈస్ట్రోజన్ పెరగాలంటే టోపు, సోయా, బఠాణీలు, అప్రికాట్స్, బ్రొకలీ, కాలీఫ్లవర్, ఫ్లాక్స్, గుమ్మడి సీడ్స్, పెసర మొలకలు తినాలి. తక్కువ బరువు ఉన్నా, అవసరానికి మించి వ్యాయామం చేసినా ఈస్ట్రోజన్ తగ్గుతుంది.
News March 25, 2026
టీనేజ్ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

అప్పటివరకు సంతోషంగా, చురుగ్గా ఉండే కొందరు పిల్లలు కాలేజీకి వెళ్లగానే సైలెంట్ ఐపోతారు. పిల్లల ప్రవర్తనలో ఇలాంటి మార్పును వెంటనే గుర్తించాలంటున్నారు నిపుణులు. వేధింపులకు గురవుతున్నారేమో పరిశీలించాలి. ఫ్రెండ్లీగా మాట్లాడి సమాచారం రాబట్టాలి. భయాన్ని పోగొట్టి, తామున్నామనే భరోసా, నమ్మకాన్ని తల్లిదండ్రులు కలిగించాలి. ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనేలా ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని సూచిస్తున్నారు.
News March 25, 2026
SRHకు కావ్య, RCBకి అనన్య

IPLలో సన్‌రైజర్స్ ఓనర్ కావ్యా మారన్ ప్రత్యేక ఆకర్షణగా మారగా ఇప్పుడు ఆమెకు పోటీగా మరొకరు రానున్నట్లు తెలుస్తోంది. ఆర్సీబీని ఆదిత్య బిర్లా కన్సార్షియం రూ.16,725 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ ఫ్రాంచైజీ ఛైర్మన్ ఆర్యమాన్ బిర్లా సోదరి అనన్య బిర్లా యాక్టివ్‌గా మారి, మ్యాచులు చూసేందుకు వస్తారని వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.


