News December 8, 2024
రెబెల్స్ చేతిలోకి సిరియా.. What Next?
హయత్ తెహ్రీర్ అల్-షామ్ నేతృత్వంలోని రెబెల్స్ సిరియా రాజధాని డమాస్కస్ను వశం చేసుకోవడంతో Ex PM మహ్మద్ ఘాజీ అల్-జలాలీ తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు రెబెల్స్ హెడ్ అబు అల్-జులానీ ప్రకటించారు. అధికార మార్పిడి వరకు జలాలీ PMగా కొనసాగుతారన్నారు. త్వరలో ప్రజలు ఎన్నుకొనే కొత్త నాయకత్వానికి అధికారాన్ని అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్టు జలాలీ తెలిపారు.
Similar News
News February 5, 2025
ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 58 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. సా.6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి.
News February 5, 2025
తండ్రి అయ్యేందుకు 11వేల కి.మీలు ప్రయాణం
దక్షిణ చిలీలోని ‘పార్క్ టంటాకో’ అటవీ ప్రాంతాల్లో ఉండే డార్విన్స్ కప్పలకు ప్రాణాంతక కైట్రిడ్ ఫంగస్ సోకినట్లు 2023లో గుర్తించారు. దీంతో ఈ జాతి అంతరించిపోకుండా ఉండేందుకు చేపట్టిన ఎమర్జెన్సీ మిషన్లో మగ కప్పలను యూకేకు తరలించారు. దీనికోసం బోటు, విమానం, కారులో ఇలా 11వేల కి.మీలకు పైగా ప్రయాణించాయి. ఎట్టకేలకు ఈ అసాధారణ విధానం ద్వారా యూకేలో 33 పిల్లలు జన్మనిచ్చాయి. ఇవి 2గ్రాముల కంటే తక్కువ బరువుంటాయి.
News February 5, 2025
విడదల రజినీపై కేసుకు హైకోర్టు ఆదేశం
AP: మాజీ మంత్రి విడదల రజినీపై 2 వారాల్లోగా కేసు నమోదు చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. కేసు వివరాలను తమకు పంపాలని పేర్కొంది. 2019లో రజినీని ప్రశ్నించినందుకు తనను చిత్రహింసలకు గురి చేశారంటూ పిల్లి కోటి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టించి పోలీసులతో కొట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు రజినీపై కేసు నమోదు చేయకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.