News January 28, 2026
T-మున్సి‘పోల్స్’.. రంగంలోకి BJP అగ్రనేతలు!

TG: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా BJP రాష్ట్ర నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, హోం మంత్రి అమిత్ షాను ప్రచారానికి రావాలని ఆహ్వానించారు. FEB 2,3న మహబూబ్‌నగర్‌లో నితిన్ నబీన్, 8,9 తేదీల్లో నిర్మల్‌లో అమిత్‌షా సభ నిర్వహించాలని రాష్ట్ర నాయకులు భావిస్తున్నారని తెలుస్తోంది. అగ్ర నేతల పర్యటనపై 2 రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Similar News
News February 8, 2026
కృష్ణా జిల్లాలో నాన్‌వెజ్ ధరలు ఎంతంటే..?

కృష్ణా జిల్లాలో ఆదివారం నాన్‌వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ. 280, స్కిన్ రూ. 270గా విక్రయిస్తున్నారు. డిమాండ్‌ను బట్టి కొన్ని ప్రాంతాల్లో స్వల్ప మార్పులు ఉన్నట్లు సమాచారం. మటన్ కేజీ రూ.1,000గా ఉంది. చేపల్లో బొచ్చ కేజీ రూ. 220లు, 30 కోడిగుడ్లు గతవారం రూ. 165లు ఉండగా నేడు రూ. 153కు చేరుకుంది. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News February 8, 2026
క్రిష్-4కి బడ్జెట్ సెగ.. హృతిక్ వర్సెస్ ఆదిత్య చోప్రా!

‘క్రిష్ 4’ సినిమా బడ్జెట్ విషయంలో హృతిక్ రోషన్, నిర్మాత ఆదిత్య చోప్రా మధ్య డిఫరెన్సెస్ వచ్చినట్లు టాక్. డెబ్యూ డైరెక్టర్‌గా ఈ మూవీని హృతిక్ ₹500 కోట్లతో భారీగా ప్లాన్ చేస్తుంటే ఆదిత్య మాత్రం ₹350 కోట్లకే ఫినిష్ చేయాలని కండిషన్ పెట్టారట. దీంతో YRF ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొనే ఛాన్స్ ఉంది. మరోవైపు ఈ సినిమాతో ప్రియాంక బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
News February 8, 2026
‘లవ్ మ్యారేజ్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ నా జీవితం గుణపాఠం’

AP: తిరుపతి(D) పుత్తూరులో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న పద్మ అనే మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి భర్త నిరుద్యోగం, అప్పుల భారమే కారణంగా తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో “తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికీ నా జీవితం గుణపాఠం. లవ్ మ్యారేజీ చేసుకున్న పాపానికి ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.


