News June 29, 2024
T-20 వరల్డ్ కప్ ఫైనల్స్.. రాజమండ్రిలో లైవ్ స్క్రీనింగ్

ఇండియా – సౌత్ ఆఫ్రికా ఆడుతున్న టీ-20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లైవ్ స్క్రీనింగ్ రాజమండ్రిలో ఏర్పాటు చేస్తున్నట్లు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న సుబ్రహ్మణ్య మైదానంలో లైవ్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశామన్నారు. నగర ప్రజలు మైదానానికి తరలివచ్చి టీమ్ ఇండియాకి మద్దతు తెలపాలని కోరారు.
Similar News
News December 3, 2025
ఈ నెల 5న మెగా పేరెంట్స్ డే: డీఈవో

జిల్లా వ్యాప్తంగా 988 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 5వ తేదీన మెగా పేరెంట్స్ డే నిర్వహిస్తున్నట్లు డీఈఓ వాసుదేవరావు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్య పరిశీలన, బోధన విధానాలు, ప్రోగ్రెస్ కార్డులు, ల్యాబ్లు, బోధన సామాగ్రి ప్రదర్శన వంటివి నిర్వహిస్తారు. విద్యార్థుల సామర్థ్యాన్ని తల్లిదండ్రుల సమక్షంలోనే పరిశీలిస్తామని, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారని ఆయన వెల్లడించారు.
News December 3, 2025
తూ.గో: వైసీపీ నేత కారు దగ్ధం.. ఎస్పీకి ఫిర్యాదు

రాజమండ్రి రూరల్ మండలం వెంకటనగరంలో వైసీపీ నాయకుడు మోత రమేశ్ కారును మంగళవారం అర్ధరాత్రి దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. దీనిపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు.. ఎస్పీ నరసింహ కిషోర్తో ఫోన్లో మాట్లాడారు. ఘటనపై తక్షణమే విచారణ జరిపి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితునికి న్యాయం జరిగే వరకూ పోరాడతామని ఆయన స్పష్టం చేశారు.
News December 3, 2025
CM చంద్రబాబు నల్లజర్ల షెడ్యూల్ ఇదే.!

సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం 11:20కి నల్లజర్ల చేరుకుంటారని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. 11:20–11:40 AM రైతన్నా–మీ కోసం స్టాళ్ల పరిశీలన, 11:45AM వేదిక వద్దకు చేరుకుంటారు. కలెక్టర్ స్వాగత ప్రసంగం. 11:50 AM–12:15 PM రైతులతో సీఎం పరస్పర చర్చ ఉంటుందన్నారు. 12:15–12:20 PMఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రసంగం, రైతులకు సన్మానం, 1.15 గంటలకు పార్టీ కేడర్తో సమావేశం అవుతారన్నారు.


