News July 16, 2024
T-SAT సేవలు తక్షణమే పునరుద్ధరించాలి: KTR

TG: T-SAT ఛానళ్లు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో మూగబోయాయని కేటీఆర్ ఆరోపించారు. ‘ప్రస్తుతం కొన్ని నోటిఫికేషన్లు విడుదలైన పరిస్థితుల్లో T-SAT ఛానళ్ల ద్వారా విద్యార్థులు, నిరుద్యోగులకు శిక్షణ అందేది. కాంగ్రెస్ అస్తవ్యస్త విధానాలతో వారికి తీవ్ర నష్టం జరుగుతోంది. NSILతో ఒప్పందంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. తక్షణమే T-SAT సేవలు పునరుద్ధరించాలి’ అని KTR డిమాండ్ చేశారు.
Similar News
News September 13, 2025
ASIA CUP: నిప్పులు చెరిగిన లంక బౌలర్లు

ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచులో శ్రీలంక బౌలర్లు విజృంభించారు. నువాన్ తుషారా, దుష్మంత చమీర నిప్పులు చెరిగే బంతులతో బంగ్లా బ్యాటర్లకు చుక్కలు చూపించారు. దీంతో ఖాతా తెరవకుండానే బంగ్లా తొలి రెండు ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు తంజిద్ హసన్(0), పర్వేజ్ ఎమోన్(0) డకౌట్లుగా వెనుదిరిగారు. హృదోయ్ (8) రనౌట్‌గా వెనుదిరిగారు. ప్రస్తుతం బంగ్లా స్కోర్ 5 ఓవర్లలో 16/3గా ఉంది.
News September 13, 2025
ఆ ఊరి నిండా IAS, IPSలే!

UPలోని మాధోపట్టి గ్రామం UPSC ఫ్యాక్టరీ, IAS విలేజ్‌గా ప్రసిద్ధి చెందింది. ఆ గ్రామం 50 మందికిపైగా సివిల్ సర్వెంట్లను తయారు చేసింది. వారంతా IAS, IPS, IRS, IFS ఆఫీసర్లుగా సేవలందిస్తున్నారు. 1914లో ముస్తఫా ఈ గ్రామం నుంచి మొట్టమొదటి సివిల్ సర్వెంట్ అయ్యారు. ఆ తర్వాత ఒకే కుటుంబంలో నలుగురు సోదరులు సివిల్స్‌కు ఎంపిక కావడంతో ఆ గ్రామం పేరు మార్మోగిపోయింది. ఈ ఊరికి వచ్చిన కోడళ్లు కూడా IAS, IPS సాధించారు.
News September 13, 2025
ఆసియాకప్: ఫైనల్లో భారత మహిళా జట్టు

హాకీ ఆసియా కప్‌లో భారత మహిళా జట్టు ఫైనల్ చేరింది. జపాన్‌తో జరిగిన సూపర్ స్టేజి-4 మ్యాచ్‌లో 1-1 గోల్స్‌తో మ్యాచ్ డ్రాగా ముగియగా, అటు కొరియాపై చైనా 1-0తో విజయం సాధించింది. దీంతో పాయింట్ల ఆధారంగా ఉమెన్ ఇన్ బ్లూ జట్టు ఫైనల్ చేరింది. రేపు చైనాతో అమీతుమీ తేల్చుకోనుంది. గెలిచిన జట్టు వచ్చే ఏడాది జరిగే WCనకు అర్హత సాధించనుంది. ఇటీవల జరిగిన పురుషుల హాకీ ఆసియాకప్‌లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.