News July 19, 2024
T-సిరీస్ ప్రొడ్యూసర్ కూతురు మృతి

నటుడు, T-సిరీస్ ప్రొడ్యూసర్ క్రిషణ్ కుమార్ కుమార్తె తిశా(20) మరణించారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె జర్మనీలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు T-సిరీస్ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. చాలాకాలం నుంచి తిశా క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. గతేడాది నవంబర్‌లో యానిమల్ ప్రీమియర్ తర్వాత ఆమె బాహ్య ప్రపంచానికి దూరమయ్యారు.
Similar News
News March 11, 2026
రైల్వేపై LPG ప్రభావం.. ఫుడ్ డెలివరీలో అంతరాయం!

భారత్‌లో LPG కొరత రైల్వే వ్యవస్థపైనా ప్రభావం చూపుతోంది. రైళ్లలో భోజన సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. టికెట్ బుకింగ్ సమయంలోనే ఫుడ్ ఆర్డర్ చేసినవారికే ప్రయారిటీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అటు ప్రత్యామ్నాయ వంట పద్ధతులకు మారాలని స్టేషన్లలోని ఫుడ్ ప్లాజాలు, రిఫ్రెష్‌మెంట్, జన్ ఆహార్ అవుట్‌లెట్లకు IRCTC లేఖ రాసింది. ఈ సంస్థ రోజుకు 17 లక్షల భోజనాలు డెలివరీ చేస్తోంది.
News March 11, 2026
‘విజయ’ పేరిట కల్తీ నెయ్యి.. పరీక్షిస్తామన్న మంత్రి లోకేశ్

AP విజయ బ్రాండ్ పేరిట విక్రయిస్తున్న నెయ్యిలో కల్తీ జరుగుతోందని TGDDCF ఛైర్మన్ <<19324480>>అమిత్ రెడ్డి<<>> చేసిన ఆరోపణలపై మంత్రి లోకేశ్ స్పందించారు. మార్కెట్ నుంచి రాండమ్ శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. TGDDCF వద్ద ఉన్న CALF, NDDB టెస్ట్ రిపోర్ట్స్‌ను కూడా పరిశీలిస్తామన్నారు. క్వాలిటీ, కస్టమర్ల ఆరోగ్యం విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. మేఘనా ఫుడ్స్‌కు విజయ(AP) ఫ్రాంచైజీ ఇచ్చారు.
News March 11, 2026
నెక్స్ట్ T20 కెప్టెన్ సంజూ కావొచ్చు: కైఫ్

సూర్యకుమార్ ఫిట్‌గా ఉన్నంత కాలం T20 టీమ్ కెప్టెన్‌గా కొనసాగొచ్చని మాజీ క్రికెటర్ కైఫ్ అన్నారు. ఒకవేళ ఆయన తప్పుకొంటే కెప్టెన్‌గా సంజూ శాంసన్ సరైన వ్యక్తి అని అభిప్రాయపడ్డారు. IPLలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా అతనికి ఉన్న అనుభవం కలిసొస్తుందని పేర్కొన్నారు. ప్రపంచకప్‌లో అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన 31 ఏళ్ల సంజూ టీమ్‌ను నడిపించగల సమర్థుడని కొనియాడారు.


