News March 27, 2024
రేపటి నుంచే T+0 సెటిల్‌మెంట్ సైకిల్ అమలు
బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ప్రతిపాదించిన టీ+0 సెటిల్‌మెంట్ సైకిల్ రేపటి నుంచి అమలులోకి రానుంది. 25 స్టాక్స్‌కు ఈ సదుపాయాన్ని కల్పించనుంది. ఇందులో అంబుజా సిమెంట్స్, బజాజ్ ఆటో, BPCL మొదలైన బడా స్టాక్స్ ఉన్నాయి. ఈ టీ+0లో లావాదేవీలు చేసిన రోజే సంబంధిత ఖాతాలకు క్యాష్/షేర్లు చేరతాయి. కాగా ప్రస్తుతం టీ+1 సైకిల్ అమలులో ఉంది. ఇందులో లావాదేవీలు చేసిన మరుసటి రోజు సంబంధిత అకౌంట్లకు క్యాష్/షేర్లు బదిలీ అవుతాయి.
Similar News
News November 5, 2024
పత్తిలో తేమ శాతం 8-12 మధ్య ఉండాలి: మంత్రి తుమ్మల
TG: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని విక్రయించాలని రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పత్తిలో తేమ శాతం 8-12 మధ్య ఉండేలా చూసుకోవాలన్నారు. కొనుగోళ్లకు సంబంధించిన సమాచారం కోసం వాట్సాప్ నంబర్ 8897281111ను సంప్రదించాలని చెప్పారు. పత్తి కొనుగోళ్లపై సమీక్షించిన ఆయన, నోటిఫై చేసిన ప్రతి జిన్నింగ్ మిల్లు పనిచేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
News November 5, 2024
విద్యుత్ ఉత్పత్తి చేసే దుస్తులు!
గాలి, నీరు, బొగ్గు, సూర్యరశ్మి ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడమే ఇప్పటివరకు చూశాం. అయితే, స్వీడన్‌లోని చాల్మర్స్ వర్సిటీ నిపుణులు సిల్క్ థ్రెడ్‌తో చేసిన వస్త్రాలతో కరెంట్ తయారుచేసే పద్ధతి కనుగొన్నారు. కండక్టివ్ ప్లాస్టిక్ మెటీరియల్ పూత ఉన్న సిల్క్ థ్రెడ్‌తో చేసిన దుస్తులు శరీరంలోని వేడిని గ్రహించి విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. ఇలా వచ్చిన విద్యుత్‌ను USB ద్వారా పోర్టబుల్ పరికరాలను ఛార్జ్ చేయొచ్చు.
News November 5, 2024
షకీబ్ బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదు
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ బౌలింగ్ శైలిపై అంపైర్లు ఐసీసీకి ఫిర్యాదు చేశారు. కౌంటీల్లో సర్రే తరఫున ఆడుతున్న షకీబ్ బౌలింగ్‌పై అంపైర్లు అనుమానం వ్యక్తం చేశారు. కాగా దాదాపు 13 ఏళ్ల తర్వాత షకీబ్ కౌంటీల్లో రీఎంట్రీ ఇచ్చారు. సోమర్‌సెట్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆయన 9 వికెట్లు తీశారు.