News December 20, 2025
T20ల్లో తిరుగులేని జట్టుగా టీమ్‌ఇండియా!

టీ20 సిరీసుల్లో భారత్ జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. తాజాగా SAపై సిరీస్ గెలుపుతో IND వరుసగా 8వ ద్వైపాక్షిక T20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. 2023 డిసెంబర్ నుంచి ఇది కొనసాగుతోంది. మొత్తంగా భారత్ వరుసగా 14 సిరీస్‌లు(ద్వైపాక్షిక+ టోర్నమెంట్లు) గెలిచింది. ఇందులో 2023 ఏషియన్ గేమ్స్, 2024 T20 వరల్డ్ కప్, 2025 ఆసియా కప్ కూడా ఉన్నాయి. టీమ్ఇండియా చివరిసారి 2023 ఆగస్టులో WIపై 3-2 తేడాతో సిరీస్ కోల్పోయింది.
Similar News
News December 20, 2025
Money Tip: తొందరొద్దు.. 48 గంటలు ఆగండి!

పెద్దగా ఆలోచించకుండా ఏదైనా వస్తువు కొనడాన్ని Impulsive Buying అంటారు. దీనివల్ల అనవసరమైన వాటిని కొని దీర్ఘకాలంలో ₹లక్షల్లో నష్టపోతాం. దీనికి పరిష్కారమే 48 గంటల రూల్. ఏదైనా కొనాలనిపిస్తే వెంటనే ఆర్డర్ చేయకుండా 2 రోజులు ఆగాలి. ఆ గ్యాప్‌లో ఆ వస్తువు అవసరమా కాదా మీకే అర్థమవుతుంది. ఇలా ఖర్చులు తగ్గించి ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్‌లో భారీ మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు.
News December 20, 2025
సర్పంచ్ ఫలితాలు.. 18 మంది ఎమ్మెల్యేలపై PCC చీఫ్ అసంతృప్తి

TG: సర్పంచ్ ఫలితాల్లో ఆశించిన మేర ఫలితాలు రాలేదని 18 మంది MLAలపై AICC ఇన్‌ఛార్జ్ మీనాక్షి, TPCC చీఫ్ మహేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రెబల్స్‌ను బుజ్జగించలేకపోవడం, బంధువులను నిలబెట్టడంతో పార్టీకి నష్టం జరిగిందని ఆగ్రహించారు. ఫలితాలపై CM రేవంత్ క్షేత్రస్థాయి నివేదిక తెప్పించుకుని రివ్యూ చేశారు. కొంత మంది MLAలను పార్టీపరంగా మందలించేందుకు ఆ నివేదికను PCC చీఫ్‌కు పంపించగా ఇవాళ సమీక్ష నిర్వహించారు.
News December 20, 2025
అగ్నివీరులకు గుడ్‌న్యూస్.. BSFలో 50 శాతం కోటా

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అగ్నివీరులకు గుడ్‌న్యూస్ చెప్పింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) కానిస్టేబుల్ నియామకాల్లో మాజీ అగ్నివీరుల కోటాను 10% నుంచి 50%కి పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ మార్పులు ప్రస్తుతానికి BSFకే వర్తిస్తాయని, ఇతర కేంద్ర బలగాలకు కాదని స్పష్టం చేసింది. కాగా అగ్నివీరులకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ నుంచి మినహాయింపు ఉండగా, రాత పరీక్ష తప్పనిసరి అని పేర్కొంది.


