News February 7, 2026

T20 క్రికెట్ ఇలా మొదలైంది!

image

కౌంటీ మ్యాచులకు ఆదరణ తగ్గుతుండటంతో కొత్త ఫార్మాట్ తీసుకురావాలని ఇంగ్లండ్ బోర్డు భావించింది. త్వరగా ముగిసేలా, స్పాన్సర్లను, కొత్త తరం అభిమానులను ఆకర్షించేలా ఉండాలని ఆలోచించింది. ఈ క్రమంలో T20లను ECB మార్కెటింగ్ మేనేజర్ రాబర్ట్‌సన్ ప్రతిపాదించారు. అలా 2003 జూన్ 13న ENGలో మొదటి T20 కౌంటీ మ్యాచ్ జరిగింది. 2005 Feb 17న NZ, AUS మధ్య తొలి మెన్స్ ఇంటర్నేషనల్ T20 మ్యాచ్ జరిగింది.
*నేటి నుంచి T20 WC

Similar News

News February 24, 2026

సొంతిళ్లు లేని వారికి శుభవార్త

image

AP: పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 స్కీమ్ కింద సొంతింటి కోసం రాష్ట్రంలో 10.42 లక్షల మంది అప్లై చేసుకున్నారు. సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి 8.29 లక్షలు, స్థలం+ఇంటి కోసం 2.13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆమోదం తెలపగా కేంద్రం మరోసారి ఆ వివరాలను పరిశీలిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తవగానే ఏప్రిల్‌లో ఇళ్లను మంజూరు చేసి లబ్ధిదారుల జాబితాను ప్రకటించనుంది.

News February 24, 2026

టీచర్ కావాలనుకుంటున్నారా? ఇది మీ కోసమే

image

నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(NCET-2026) <>దరఖాస్తుల<<>> ప్రక్రియ కొనసాగుతోంది. మార్చి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. వర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లలో 4ఏళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్(ITEP)లో ప్రవేశాల కోసం NTA ఈ పరీక్ష నిర్వహిస్తోంది. ఇంటర్ చదువుతున్న/పాసైనవారు అర్హులు. ఏప్రిల్ 17న పరీక్ష ఉంటుంది. ఇంటర్ తర్వాత B.A/BSc/BComతో పాటు B.Ed ఒకేసారి పూర్తి చేసేలా ఈ 4yrs కోర్సును రూపొందించారు.

News February 24, 2026

వెండి, బంగారు నగలు కలిపి ఉంచితే?

image

చాలామంది బంగారం, వెండి నగలను కలిపి భద్రపరుస్తారు. అయితే ఈ రెండింటినీ కలిపి ఉంచడం సరి కాదంటున్నారు నిపుణులు. వెండి రియాక్టివ్ మెటల్. ఇది ఏదైనా ఇతర లోహంతో కలిసినప్పుడు మూలకాలు ప్రతిస్పందించి చర్య మెుదలవుతుంది. నెమ్మదిగా వెండి ఆభరణాలపై బంగారు పొర ఏర్పడుతుంది. బంగారం నాన్-రియాక్టివ్ మెటల్. అది ఏ లోహంతోనూ స్పందించదు. కానీ క్రమంగా మెరుపు తగ్గుతుంది. కాబట్టి వీటిని విడివిడిగా భద్రపరచాలని సూచిస్తున్నారు.