News September 28, 2024
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన

బంగ్లాదేశ్తో జరిగే టీ20 సిరీస్కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది.
జట్టు: సూర్య (C), అభిషేక్ శర్మ, శాంసన్, రింకూ సింగ్, హార్దిక్, రియాన్ పరాగ్, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్
*అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో మూడు T20లు జరగనున్నాయి.
Similar News
News October 23, 2025
మ్యూజిక్ డైరెక్టర్ సబేశన్ కన్నుమూత

తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ MC సబేశన్(68) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలో మరణించారు. లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ దేవా సోదరుడే సబేశన్. తన మరో సోదరుడు మురళీతో కలిసి దేవా వద్ద అసిస్టెంట్గా పనిచేశారు. తర్వాత సబేశన్-మురళి జోడీ పాపులరైంది. పొక్కిషమ్, కూడల్ నగర్, మిలగ, గొరిపలయమ్, 23వ పులకేశి, అదైకాలమ్, పరాయ్ మొదలైన చిత్రాలకు సంగీతం అందించింది. రేపు చెన్నైలో సబేశన్ అంత్యక్రియలు జరుగుతాయి.
News October 23, 2025
మానవాళికి దైవానుగ్రహం ఎందుకు అవసరం?

మనం వేసిన విష బీజం విష ఫలాన్నే ఇస్తుంది. అలాగే మన చెడు కర్మల ఫలితంగా మనకు బాధలు, దుఃఖాలు కలుగుతాయి. ఈ కర్మ బంధాన్ని తెంచుకోవడం మానవ ప్రయత్నంతో సాధ్యం కాదు. ఎందుకంటే, మన కర్మలన్నీ అసంఖ్యాకమైనవి. అందుకే, ఈ బంధాల నుంచి విముక్తి పొందడానికి దైవానుగ్రహం అవసరం. ఆ దేవుడి కృప మనకు లభించినప్పుడు, ఆయన శక్తి మన కర్మ ఫలాలను తొలగించి, కష్టాల నుంచి విముక్తిని, నిజమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది. <<-se>>#Daivam<<>>
News October 23, 2025
భారత్ ఓటమి

AUSతో జరిగిన రెండో వన్డేలో భారత్ పరాజయం పాలైంది. ఈ ఓటమితో ఇంకో మ్యాచ్ ఉండగానే 0-2 తేడాతో వన్డే సిరీస్ను కోల్పోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన IND 50 ఓవర్లలో 264-9 రన్స్ చేసింది. 265 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఆసీస్ 2 వికెట్ల తేడాతో గెలిచింది. షార్ట్(74), కాన్లీ(61), ఒవెన్(36) రాణించారు. IND బౌలర్లలో హర్షిత్ రాణా, సుందర్, అర్ష్దీప్ తలో 2 వికెట్లు తీశారు. 25న సిడ్నీలో మూడో వన్డే జరగనుంది.