News July 25, 2024
భారత్తో టీ20 సిరీస్.. శ్రీలంకకు మరో షాక్

ఎల్లుండి నుంచి భారత్తో జరిగే టీ20 సిరీస్కు మరో శ్రీలంక పేసర్ దూరమయ్యారు. ట్రైనింగ్ సందర్భంగా నువాన్ తుషారా ఎడమ చేతి వేలు విరిగిపోయిందని, దీంతో అతడు టీ20 సిరీస్ నుంచి వైదొలిగినట్లు ఆ జట్టు మేనేజర్ వెల్లడించారు. ఇప్పటికే అనారోగ్యం కారణంగా చమీర దూరం కాగా, అతని స్థానంలో అసిత ఫెర్నాండోను ఎంపిక చేశారు. కాగా తుషారా స్థానంలో మధుశంక జట్టులోకి వచ్చే అవకాశముంది.
Similar News
News October 14, 2025
LOC వెంబడి ఉగ్రమూక చొరబాటు యత్నం!

జమ్మూకశ్మీర్లోని కుప్వారా సెక్టార్లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని ఇండియన్ ఆర్మీ భగ్నం చేసినట్లు తెలుస్తోంది. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాకిస్థాన్ వైపు నుంచి కొన్ని అనుమానాస్పద కదలికలను భారత ఆర్మీ గుర్తించింది. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో అటుగా జవాన్లు కాల్పులు జరిపారు. పాక్ వైపు నుంచి సరిహద్దు దాటే ప్రయత్నం జరిగినట్లు ఆర్మీ భావిస్తోంది. ప్రస్తుతం ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి.
News October 14, 2025
రంజీ ట్రోఫీకి ఏపీ జట్టు ఇదే

రంజీ ట్రోఫీ (2025-26)లో ఆడే జట్టును ఏపీ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. రికీ భుయ్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు.
జట్టు: రికీ భుయ్ (C), KS భరత్, అభిషేక్ రెడ్డి, SK రషీద్, కరణ్ షిండే, PVSN రాజు, KV శశికాంత్, సౌరభ్ కుమార్, Y పృథ్వీరాజ్, T విజయ్, S ఆశిష్, అశ్విన్ హెబ్బర్, రేవంత్ రెడ్డి, K సాయితేజ, CH స్టీఫెన్, Y సందీప్.
News October 14, 2025
1,968 మంది టెర్రరిస్టులను తరలించాం: ఇజ్రాయెల్

గాజా పీస్ ప్లాన్లో భాగంగా తమ అధీనంలో ఉన్న 20 మంది ఇజ్రాయెల్ బందీలను హమాస్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇజ్రాయెల్ కూడా తమ జైళ్లలో ఉన్న పాలస్తీనియన్ల విడుదల ప్రక్రియను స్టార్ట్ చేసింది. ‘దేశవ్యాప్తంగా వివిధ జైళ్లలో ఉన్న 1,968 మంది టెర్రరిస్టులను ఓఫర్, కట్జియోట్ కేంద్రాలకు తరలించాం. అనుమతుల ప్రక్రియ ముగిశాక వారిని గాజాకు పంపిస్తాం’ అని అధికారిక ప్రకటనలో వెల్లడించింది.