News July 6, 2024

నేటి నుంచి జింబాబ్వేతో టీ20 సిరీస్

image

జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత యువ జట్టు ఈరోజు తొలి మ్యాచ్ ఆడనుంది. హరారే వేదికగా సాయంత్రం 4.30గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ సోనీ స్పోర్ట్స్ 4, 5 ఛానళ్లలో ప్రసారం అవుతుంది. అటు రోహిత్‌, కోహ్లీ, జడేజా రిటైర్మెంట్‌తో జట్టు కూర్పుపై BCCI దృష్టి పెట్టగా వారి వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి యువ క్రికెటర్లకు ఇది ఓ ఎంట్రన్స్ టెస్టులా మారింది. మరి ఈ టెస్టులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

Similar News

News April 6, 2026

లాకప్ డెత్ కేసు.. తొమ్మిది మంది పోలీసులకు మరణ శిక్ష

image

తమిళనాడులో 2020లో జరిగిన తండ్రి-కుమారుల లాకప్ డెత్ కేసుపై మదురై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో తొమ్మిది మంది పోలీసులకు మరణ శిక్ష విధించింది. లాక్‌డౌన్‌లో 2020 జూన్ 19న జయరాజ్, ఆయన కుమారుడు జే బెన్నిక్స్‌ను పోలీసులు లాకప్‌లో వేశారు. విచారణ పేరుతో హింసించడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. అనుమతించిన దాని కంటే ఎక్కువ సమయం మొబైల్ షాప్ నడిపారని వీరిని అరెస్ట్ చేయగా ఆ ఆరోపణల్లో నిజం లేదని తేలింది.

News April 6, 2026

వాట్సాప్ యూజర్లకు శుభవార్త

image

జర్నీస్, ఔట్ డోర్స్‌లో వాట్సాప్ ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు నాయిస్‌తో ఇబ్బంది పడుతున్నారా? అలాంటి వారికి వాట్సాప్ శుభవార్త చెప్పింది. రియల్ టైమ్‌లో బ్యాక్ గ్రౌండ్ నాయిస్‌ను తొలగించి, వాయిస్ క్వాలిటీని పెంచే ఫీచర్‌ను డెవలప్ చేసింది. దీన్ని ప్రస్తుతం కొందరు Beta యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే అందరికీ 2.26.14.1 వెర్షన్‌ అప్డేట్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

News April 6, 2026

KKR vs PBKS మ్యాచ్‌కు వర్షం ముప్పు!

image

IPL: కాసేపట్లో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే KKR, PBKS మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. రాత్రి 8 గంటలకు వర్షం పడే ఛాన్స్ 90% ఉందని, దీంతో మ్యాచ్‌కు అంతరాయం కలగొచ్చని వెదర్‌ రిపోర్ట్ చెబుతోంది. అదే జరిగితే మ్యాచ్ రద్దయ్యి ఇరు జట్లకు చెరో పాయింట్ వస్తుంది. అయితే ప్రస్తుతానికి అక్కడ వాతావరణం పొడిగా ఉన్నట్లు సమాచారం. కాగా గత ఏడాది ఈడెన్‌లో జరిగిన KKR-PBKS మ్యాచ్‌ వర్షం కారణంగా ఆగిపోయిన విషయం తెలిసిందే.