News July 18, 2024

T20 జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా సూర్య

image

శ్రీలంకతో ఈ నెల 27 నుంచి జరిగే 3 టీ20ల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్య‌ కుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.
జట్టు: సూర్య(C), గిల్(VC), హార్దిక్, జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, పంత్, శాంసన్, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్.

Similar News

News January 22, 2026

డ్రాగన్ ఫ్రూట్ కాపు వేగంగా రావాలంటే..

image

డ్రాగన్ ఫ్రూట్ సాగుకు నర్సరీల్లో మొక్కే అవసరం లేదంటున్నారు నిపుణులు. ఈ మధ్యే పంట కట్ చేసిన డ్రాగన్ ఫ్రూట్ మొక్క నుంచి.. 3-4 అడుగుల కొమ్మను తీసుకొని నవంబర్, డిసెంబర్‌లో నాటాలి. ఇలా చేస్తే మొక్క నాటిన 6 నెలల్లోనే పూత, కాయలు వచ్చి, మంచి యాజమాన్యం పాటిస్తే వచ్చే డిసెంబర్ నాటికి కనీసం 2 టన్నుల దిగుబడి వస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ పంట సాగు, అధిక దిగుబడికి కీలక సూచనల కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.

News January 22, 2026

IITRలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

CSIR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్‌(IITR) 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్ అర్హతతో పాటు LMV&HMV డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు FEB 19 వరకు అప్లై చేసుకోవచ్చు. MTS పోస్టులకు గరిష్ఠ వయసు 25ఏళ్లు కాగా.. డ్రైవర్ పోస్టుకు 27ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ట్రేడ్ టెస్ట్/స్కిల్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: csiriitrprograms.in

News January 22, 2026

వసంత పంచమి ఎందుకు జరుపుకొంటారు?

image

జ్ఞానానికి అధిదేవత అయిన సరస్వతీ దేవి మాఘ శుక్ల పంచమి నాడు జన్మించినట్లు పురాణాల వాక్కు. ఆ రోజునే వసంతి పంచమిగా జరుపుకొంటాం. బ్రహ్మదేవుడు సృష్టిలో భాగంగా లోకానికి వాక్కును, చైతన్యాన్ని ప్రసాదించడానికి అమ్మవారిని ఆవిర్భవించారు. అందుకే ఈ రోజును ‘శ్రీ పంచమి’, ‘వాగీశ్వరి జయంతి’గా కూడా పిలుస్తారు. వసంత కాలం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగులను నింపే పండుగ ఇది.