News January 5, 2026
T20 WCలో భారత్‌కు అతడే కీ ప్లేయర్: డివిలియర్స్

రానున్న T20 WCలో భారత జట్టులో హార్దిక్ పాండ్య కీ ప్లేయర్ అని SA క్రికెట్ దిగ్గజం డివిలియర్స్ అన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా అతను బ్యాటింగ్, బౌలింగ్ చేయగలరని కొనియాడారు. పాండ్య జట్టులో ఉండటం కెప్టెన్ సూర్యకు పెద్ద ఆస్తి అని తెలిపారు. హార్దిక్ నాలుగైదు ఓవర్లు క్రీజులో ఉంటే ప్రత్యర్థి జట్టుకు ఓటమి ఖాయమని చెప్పారు. ఇటీవల VHTలో పాండ్య ఒకే ఓవర్లో 5 సిక్సులు బాది విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే.
Similar News
News January 5, 2026
బంగ్లాదేశ్ ఎన్నికలపై భారత్ కలవరపాటు!

బంగ్లాదేశ్‌లో మార్చిలో జరిగే ఎన్నికలు భారత ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం బంగ్లాలో నెలకొన్న పరిస్థితులు, తాత్కాలిక ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి దీనికి కారణాలుగా ఉన్నాయి. నిషేధిత అవామీ లీగ్‌ను జాతీయ పార్టీ BNP, జమాత్‌తో పాటుగా ఎన్నికల పోటీకి అనుమతించాలనే భారత్ కోరుకుంటోంది. స్వేచ్ఛ లేకుండా ఎన్నికలు జరిగితే మైనారిటీలపై దాడులు మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్రం ఆందోళన చెందుతోంది.
News January 5, 2026
మహ్మద్ సిరాజ్ అన్‌లక్కీ: డివిలియర్స్

మహ్మద్ సిరాజ్ కెరీర్‌పై SA మాజీ క్రికెటర్ AB డివిలియర్స్ స్పందించారు. ‘సిరాజ్ తిరిగి ODI జట్టులోకి రాగలిగాడు. కానీ అతను అన్‌లక్కీ. T20 వరల్డ్ కప్‌కి ఎంపిక కాలేదు. సెలక్టర్స్ టీమ్ బ్యాలన్స్‌పైనే ఫోకస్ చేశారు. సీమర్స్‌పై ఆధారపడకుండా స్పిన్నర్లకు ప్రాధాన్యమిచ్చారు. బుమ్రా, అర్ష్‌దీప్ జట్టులో ఉన్నారు. బ్యాటింగ్ చేయగలడని హర్షిత్ రాణాకు కూడా అవకాశమిచ్చారు’ అని తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నారు.
News January 5, 2026
రాష్ట్రంలో 220 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<


