News February 26, 2026
T20 WC: టాస్ ఓడిన భారత్

చెన్నై వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచులో జింబాబ్వే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమ్ఇండియా జట్టులో 2 మార్పులు జరిగాయి. రింకూ స్థానంలో సంజూ, సుందర్ ప్లేస్‌లో అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చారు.
IND: సంజూ శాంసన్, అభిషేక్, ఇషాన్, సూర్య, తిలక్, హార్దిక్, దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్, వరుణ్, బుమ్రా.
ZIM: మారుమని, బెనెట్, మేయర్స్, బర్ల్, రజా, మున్యోంగా, ముసెకివా, ఇవాన్స్, మపోసా, ముజరబని, ఎంగర్వ.
Similar News
News February 26, 2026
ఆధార్ సెంటర్ ఎక్కడుందో ఈజీగా తెలుసుకోవచ్చు!

మీ ప్రాంతంలో ఆధార్ సెంటర్ ఎక్కడుందో తెలుసుకోవడం ఇబ్బందిగా ఉందా? త్వరలో అలాంటి సమస్య ఉండదు. గూగుల్ మ్యాప్స్‌లో సెంటర్ అడ్రస్, అక్కడ అందే సేవల డిటైల్స్ కనిపించనున్నాయి. పార్కింగ్, సెంటర్ టైమింగ్స్ తదితర వివరాలూ తెలుసుకోవచ్చు. అందుకు గూగుల్‌తో UIDAI ఒప్పందం కుదుర్చుకుంది. ఆధార్ నమోదు, తప్పుల సవరణ తదితరాలకు ఈజీగా అధికారిక సెంటర్లను గుర్తించడానికి ఇది దోహదపడుతుందని UIDAI తెలిపింది.
News February 26, 2026
లిక్కర్ కేసు నిందితుడు ముప్పిడి అవినాశ్ రెడ్డికి రిమాండ్

AP: లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు ముప్పిడి అవినాశ్ రెడ్డికి ACB కోర్టు రేపటి దాకా రిమాండ్ విధించింది. గుంటూరు(D) జైలుకు అతడిని తరలించారు. A1 రాజ్ కసిరెడ్డితో కలిసి అవినాశ్ ₹కోట్ల లావాదేవీలు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ‘మద్యం సిండికేట్‌కు ప్రధాన వ్యూహకర్తగా వ్యవహరించారు. ముడుపులు చెల్లించే కొత్త బ్రాండ్లకు అనుకూలంగా ఆర్డర్ ఫర్ సప్లై కేటాయించారు’ అని అందులో వెల్లడించారు.
News February 26, 2026
కన్నులపండువగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

AP: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీసీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. తొలిరోజు స్వామి పుష్కరిణిలో తెప్పపై మూడు సార్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.


