News January 24, 2026
T20 WC నుంచి బంగ్లా ఔట్.. ఏం జరిగింది?

బంగ్లాలో అల్లర్లు, హిందువులపై దాడులతో భారతీయుల్లో నిరసన వ్యక్తమైంది. దీంతో IPLలో KKR తరఫున ఆడాల్సిన ముస్తాఫిజుర్‌ను తొలగించాలని BCCI ఆదేశించింది. అందుకు ప్రతీకారంగా BAN తమ దేశంలో IPL ప్రసారాన్ని నిలిపివేయడంతో వివాదం ముదిరింది. INDలో T20 WCకు తామూ రాబోమని BAN మొండికేసింది. వేదికల మార్పు కుదరదని ICC తేల్చి చెప్పింది. BAN తమ నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో WCకు ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను తీసుకుంది.
Similar News
News February 27, 2026
తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలి: కలెక్టర్ ప్రావీణ్య

రాబోయే వేసవి కాలంలో జిల్లాలో తాగునీటి ఎద్దడి కలగకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, గ్రామాల్లో నీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
News February 27, 2026
రింకూ సింగ్.. తండ్రి చనిపోయిన బాధలోనూ..

T20WC: యంగ్ క్రికెటర్ రింకూ సింగ్ రేపు కోల్‌కతాలో భారత జట్టులో చేరుతారని బీసీసీఐ వెల్లడించింది. మార్చి 1న టీమ్ ఇండియా ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. కాగా ఇవాళ తండ్రి మరణంతో <<19254408>>రింకూ<<>> సింగ్ అలీగఢ్ (యూపీ) వెళ్లిన సంగతి తెలిసిందే. తండ్రి <<19250311>>మరణించిన<<>> మరుసటి రోజే రింకూ దేశం కోసం ఆడేందుకు సిద్ధం కావడంపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
News February 27, 2026
స్వాతంత్ర్యం వచ్చినా బానిస మనస్తత్వం పోలేదు: ప్రధాని మోదీ

ఒకప్పుడు ఫారిన్ టెక్నిక్స్ కాపీ కొట్టే దుస్థితిలో భారత్ ఉండేదని ప్రధాని మోదీ రైజింగ్ భారత్ సమ్మిట్‌లో తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చినా చాలా కాలం దేశంలో బానిస మనస్తత్వం పోలేదని విమర్శించారు. ఇప్పుడు తన శక్తి ఏంటో తెలుసుకొని దాని నుంచి బయటపడి అగ్రరాజ్యాలతో ట్రేడ్ డీల్స్ చేసుకునే స్థాయికి భారత్ ఎదిగిందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో ట్రేడ్ డీల్స్ జరుపుకోవడం చూసి కొందరు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు.


