News February 21, 2026
T20 WC: సూపర్-8 ఫైట్ జరుగుతుందిలా..

లీగ్ దశ <<19197455>>ముగిసిన<<>> తర్వాత 2 గ్రూపుల్లో నాలుగేసి జట్లున్నాయి. ప్రతి గ్రూపులోని ఒక టీమ్ మిగిలిన మూడింటితో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అలా ఈ స్టేజీ ముగిసేలోపు 2 గ్రూపుల్లో టాప్-2లో ఉండే 4 జట్లు సెమీస్ చేరుతాయి. భారత్.. SA, జింబాబ్వే, విండీస్‌తో ఆడనుంది. మరో గ్రూపులో న్యూజిలాండ్, పాకిస్థాన్, ఇంగ్లండ్, శ్రీలంక ఉన్నాయి. సెమీస్‌లో విజయం సాధించిన జట్టు ఫైనల్ చేరుతుంది. సూపర్-8 షెడ్యూల్ పైన ఇమేజ్‌లో చూడవచ్చు.
Similar News
News February 27, 2026
విజయ్‌కు ఓ నటితో వివాహేతర సంబంధం.. భార్య ఆరోపణలు

హీరో విజయ్ నుంచి విడాకులు కోరుతూ <<19254475>>పిటిషన్<<>> దాఖలు చేసిన భార్య సంగీత సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తకు ఓ నటితో వివాహేతర సంబంధం ఉందన్నారు. 2021లో ఈ విషయం తెలిసి మానసిక క్షోభకు గురైనట్లు చెప్పారు. ఇది పెళ్లిపై ఉన్న నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయేటట్లు చేసిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా ఇటీవల TNకు చెందిన ఓ BJP నేత సైతం విజయ్‌కు ఓ నటితో అఫైర్ అంటగడుతూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
News February 27, 2026
SIDBIలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

లఖ్‌నవూలోని స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SIDBI) 3 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, CA, CFA, MBA, PGDM అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 18 వరకు ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.sidbi.in
News February 27, 2026
నడుము చుట్టుకొలత పెరిగితే డేంజరే

భారతీయుల శరీర నిర్మాణం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. ఇతర దేశాలవారిలో ఒకే BMI ఉన్నా, భారతీయుల్లో కొవ్వు శాతం కాస్త అధికంగా ఉంటుంది. ముఖ్యంగా భారతీయుల్లో నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. పురుషుల్లో 35.4 అంగుళాలు, స్త్రీలలో 31.5 అంగుళాలు నడుము చుట్టుకొలత దాటితే ప్రమాదమే అంటున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే సమయానికి, సరైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం, ధ్యానం చేయాలని సూచిస్తున్నారు.


