News June 18, 2024
T20 WC: ఒకే ఓవర్లో 36 పరుగులు

అఫ్గానిస్థాన్‌తో మ్యాచులో వెస్టిండీస్ బ్యాటర్ పూరన్ విధ్వంసం సృష్టించారు. అజ్మతుల్లా వేసిన 4వ ఓవర్లో ఏకంగా 36 రన్స్ వచ్చాయి. ఇందులో పూరన్ 3 సిక్సర్లు, 2 ఫోర్లు బాదారు. మిగతా 10 రన్స్ బైన్స్ రూపంలో వచ్చాయి. దీంతో T20 WCలో ఒక ఓవర్లో అత్యధిక రన్స్ సమర్పించుకున్న రికార్డ్ స్టువర్ట్ బ్రాడ్(యూవీ 6 సిక్సుల ఓవర్) ఓవర్‌ను అజ్మతుల్లా ఓవర్ సమం చేసింది. ఈ మ్యాచ్‌లో WI 104 రన్స్‌తో గెలిచింది.
Similar News
News December 6, 2025
కృష్ణా: నకిలీ సిమ్‌లు.. మరో 8 మందికి సంకెళ్లు

వినియోగదారుల ఆధార్ వివరాలు, వేలిముద్రలతో అక్రమంగా సిమ్ కార్డులను యాక్టివేట్ చేస్తున్న సైబర్ మోసగాళ్ల ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు ముమ్మరం చేసి, తాజాగా మరో 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో కృష్ణా జిల్లా పెడన ప్రాంతానికి చెందిన ఐదుగురు ఉండగా, ఈ మోసాలపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
News December 6, 2025
నిజమైన భక్తులు ఎవరంటే?

ఏదో ఆశించి భగవంతుడిని సేవించేవారు వ్యాపారస్తులు. వారు తమ కోరికల కోసం దేవునికి డబ్బు ఇచ్చి బదులుగా ఏదో ఆశిస్తారు. కానీ ఫలాపేక్ష లేకుండా స్వామిని కొలిచేవారే నిజమైన భక్తులు. మనం అడగకుండానే దేవుడు కరుణించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కష్టాలన్నీ ఆయన భగవతం ద్వారానే ధరించాడు. ఇదే నిస్వార్థ భక్తి. మనం ఏమీ ఆశించకుండా మన శక్తి మేరకు సత్కార్యాలు చేస్తూ, ఆ ఈశ్వరుడిని అందరిలో చూస్తూ సంతోషాన్ని పంచాలి. <<-se>>#Daivam<<>>
News December 6, 2025
బంధం బలంగా మారాలంటే?

భార్యాభర్తలిద్దరూ ఒకరితో ఒకరు ఎంత సమయం గడిపితే అనుబంధం అంత దృఢమవుతుందంటున్నారు నిపుణులు. వ్యక్తిగత, కెరీర్ విషయాల్లో ఇద్దరూ ఎంత బిజీగా ఉన్నా.. రోజూ కాసేపు కలిసి సమయం గడిపేలా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. తమ మధ్య పెరిగిన దూరానికి అసలు కారణాలేంటో, ఇద్దరి మనసుల్లో ఉన్న ఆలోచనలేంటో పంచుకోవాలి. అప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.. ఇద్దరూ తిరిగి కలిసిపోయేందుకు మార్గం సుగమమవుతుంది.


