News June 18, 2024

T20 WC: ఎల్లుండే మ్యాచ్.. సూర్యకు గాయం

image

భారత స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ నెట్ ప్రాక్టీస్‌ సమయంలో గాయపడ్డారు. త్రోడౌన్స్‌కు బ్యాటింగ్ సాధన చేస్తుండగా ఓ బంతి ఆయన మణికట్టును బలంగా తాకింది. ఫిజియో స్ప్రే చేసిన అనంతరం స్వల్ప విరామం తీసుకుని ఆయన ప్రాక్టీస్ కొనసాగించారు. గాయం తీవ్రత ఎలాంటిదో తెలియాల్సి ఉంది. ఎల్లుండి అఫ్గానిస్థాన్‌పై భారత్ తొలి సూపర్-8 మ్యాచ్‌ను బార్బడోస్‌లో ఆడనుంది.

Similar News

News November 28, 2025

హైదరాబాదీ బిర్యానీ.. వరల్డ్‌లో బెస్ట్!

image

భారతీయులు ఇష్టపడే వంటకాల్లో ఒకటైన హైదరాబాదీ బిర్యానీ ప్రపంచ గుర్తింపు పొందింది. ప్రఖ్యాత ఫుడ్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’ విడుదల చేసిన ‘వరల్డ్ బెస్ట్‌ రైస్‌ డిషెస్‌’ లిస్టులో HYD బిర్యానీ 10వ స్థానంలో నిలిచింది. టాప్-50లో ఇండియా నుంచి ఉన్న ఏకైక వంటకం ఇదే కావడం విశేషం. కాగా తొలి మూడు స్థానాల్లో జపాన్ వంటకాలైన ‘నెగిటోరో డాన్’, ‘సుశి’, ‘కైసెండన్’ ఉన్నాయి. ప్రపంచమే మెచ్చిన HYD బిర్యానీ మీకూ ఇష్టమా?COMMENT

News November 28, 2025

RECORD: ఎకరం రూ.151.25 కోట్లు

image

HYD: కోకాపేట-నియోపొలిస్ లేఅవుట్‌లో HMDA నిర్వహించిన భూముల వేలం మరోసారి రికార్డులు సృష్టించింది. ప్లాట్ నంబర్ 15లో ఎకరం రూ.151.25 కోట్లకు GHR సంస్థ దక్కించుకుంది. ప్లాట్ నంబర్ 16లో ఎకరం రూ.147.75 కోట్లకు గోద్రేజ్ సంస్థ సొంతం చేసుకుంది. మొత్తం 9.06 ఎకరాలకు వేలం వేయగా ప్రభుత్వానికి రూ.1353 కోట్ల భారీ ఆదాయం లభించింది. గత వారం ఇదే లేఅవుట్‌లో ఎకరం <<18376950>>రూ.137.25 కోట్లు<<>> పలికింది.

News November 28, 2025

ALERT.. పెరగనున్న చలి

image

ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఇవాళ రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి (<10°C) పడిపోతాయని, HYDలో 10°Cగా ఉండొచ్చని వాతావరణ నిపుణులు తెలిపారు. అవసరమైతేనే బయటకు వెళ్లాలని హెచ్చరించారు. ఈ నెల 30 వరకు నార్త్, సెంట్రల్ TGలో 9-11°Cగా ఉంటాయన్నారు. తుఫాన్ ప్రభావంతో DEC 2-5 వరకు MHBD, భద్రాద్రి, సూర్యాపేట్, NGKL, వనపర్తి, MBNRలో మోస్తరు వర్షాలకు ఛాన్సుందని వివరించారు.