News October 20, 2024
T20 WC FINAL: టాస్ గెలిచిన సౌతాఫ్రికా

మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.
NZ: సుజీ బేట్స్, ప్లిమ్మర్, కెర్, డివైన్(C), బ్రూక్, గ్రీన్, గాజ్, రోజ్మేరీ, లీ తహుహు, కార్సన్, ఫ్రాన్.
SA: వోల్వార్డ్ట్(C), బ్రిట్స్, అన్నేకే బాష్, క్లో ట్రయాన్, మారిజానే కాప్, సునే లూయస్, నాడిన్, డెర్క్‌సెన్, జాఫ్తా, మలాబ, ఖాకా.
> LIVE: HOTSTAR/స్టార్ స్పోర్ట్స్
Similar News
News March 27, 2026
‘శ్రీరామ’ అంటే అదే పుణ్య మంత్రం

శ్రీరామనవమి రోజున రామనామస్మరణం చేయాలని చెబుతుంటారు. రామ నామమును తారకమంత్రమని కూడా అంటారు. తారకమంత్రమంటే దేన్నైనా తేలికగా దాటించేది అని అర్థం. ఏ మంత్రము చెప్పినా దానిముందు ఓం అని.. తర్వాత నమః అని కచ్చితంగా వాడాలి. కానీ రామ నామానికి అలాంటి నియమాలేవీ లేవు. శ్రీరామ అంటే అదే పుణ్య మంత్రం. రామనామంతో ధ్యానం చేయడం వల్ల సకల పాపాలు తొలిగిపోతాయి.
News March 27, 2026
సాదాబైనామా రిజిస్ట్రేషన్లు.. కొత్త నిబంధనలివే

TG: ఇకపై దరఖాస్తు చేసేటప్పుడు భూమిని బదిలీ చేసే వ్యక్తి అఫిడవిట్ సమర్పించాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారుడి సెల్ఫ్ డిక్లరేషన్ అఫిడవిట్ సరిపోతుంది. తప్పుడు సమాచారం/పత్రాలు ఇస్తే రిజిస్ట్రేషన్ రద్దు చేసి క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. ‘భూ భారతి’లో నమోదుకు ముందు ఎవరైనా అభ్యంతరాలు తెలిపేందుకు 30days గడువుంటుంది. 5ఎకరాల్లోపు భూమి ఉన్న వారికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
News March 27, 2026
అమరావతిలో మంటలు.. సెక్యూరిటీ గార్డే నిందితుడు?

AP: <<19480669>>అమరావతిలో<<>> పైపుల దహనం కేసులో మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. సూపర్‌వైజర్‌పై కోపంతో సెక్యూరిటీ గార్డు రాము నిప్పంటించినట్లు సమాచారం. రోజూ 12 గంటల డ్యూటీ, సెలవు ఇవ్వకపోవడంతో రాము కొన్నిరోజులుగా కోపంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏదైనా పెద్ద ఘటన జరిగితేనే ఎక్కువ మంది సెక్యూరిటీ గార్డులను పెట్టుకుంటారని మంటలు పెట్టినట్లు తెలుస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.


