News June 22, 2024

T20 WC: పాక్ జట్టుపై ఫిక్సింగ్ ఆరోపణలు.. PCB ఏమందంటే?

image

లీగ్ దశలోనే ఇంటిదారి పట్టిన పాకిస్థాన్‌ జట్టుపై నెట్టింట ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో తమ ఆటగాళ్లను PCB వెనకేసుకొచ్చింది. తమకు ఎలాంటి అనుమానాలు లేవని, విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని తెలిపింది. ఆరోపణలు చేసినవారు ఆధారాలతో వస్తే విచారణ జరిపి ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అటు నిరాధార ఆరోపణలు చేసినవారికి పరువు నష్టం దావా కింద నోటీసులు పంపేందుకు PCB సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Similar News

News December 21, 2025

అన్ని లారీలకు ట్రాకింగ్ పరికరం తప్పనిసరి

image

AP: రాష్ట్రంలోని అన్ని లారీలకు వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్ (VLTD) తప్పనిసరిగా అమర్చాలని ఏపీ లారీ యజమానుల సంఘం పిలుపునిచ్చింది. ఇప్పటికే అమర్చిన పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో యజమానులు పరిశీలించాలని సూచించింది. జనవరి 1 నుంచి VLTD లేకపోయినా, పనిచేయకపోయినా రవాణా శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ(MoRTH) ఆదేశించినట్లు తెలిపింది.

News December 21, 2025

ఉత్కంఠ.. బిగ్‌బాస్ విజేత ఎవరు?

image

తెలుగు బిగ్‌బాస్-9 విజేతను హోస్ట్ నాగార్జున ఇవాళ రాత్రి ప్రకటించనున్నారు. దీంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. టాప్-5 కంటెస్టెంట్లుగా కళ్యాణ్, తనూజ, డిమోన్ పవన్, ఇమ్మాన్యుయేల్, సంజన ఉన్నారు. సోషల్ మీడియా బజ్ ప్రకారం కళ్యాణ్, తనూజలో ఒకరు విన్నర్ అవుతారని తెలుస్తోంది. తొలుత సంజన, తర్వాత ఇమ్మాన్యుయేల్, డిమోన్ ఎలిమినేట్ అవుతారని సమాచారం. విజేత ఎవరని మీరనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News December 21, 2025

ఇకపై ‘మనమిత్ర’లోనే ఆర్జిత సేవా టికెట్లు

image

AP: విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది. ఇకపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలోని అన్ని ఆర్జిత సేవల టికెట్లు మనమిత్ర వాట్సాప్ నంబర్ ద్వారానే లభ్యమవుతాయని అధికారులు తెలిపారు. కౌంటర్ల వద్ద టికెట్ల విక్రయం పూర్తిగా నిలిపివేయనున్నట్లు స్పష్టం చేశారు. ప్రత్యక్ష, పరోక్ష సేవల టికెట్లను 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా బుక్ చేసుకోవచ్చని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.