News June 24, 2024

T20 WC: ఇప్పటివరకు హోస్ట్ నేషన్స్ టైటిల్ గెలవలేదు!

image

T20 WC చరిత్రలో ఇప్పటివరకు ఏ హోస్ట్ నేషన్ కూడా టైటిల్ గెలవలేదు. 9 ఎడిషన్లలో టోర్నీ నిర్వహించిన దేశాల జట్లు కాకుండా ఇతర జట్లే విజయం సాధించాయి. 2024 WC వెస్టిండీస్, USAలో జరుగుతుండగా, ఆ రెండు జట్లు కూడా ఎలిమినేట్ అయ్యాయి. కాగా 2026 T20 WC భారత్, శ్రీలంకలో జరగనుంది. దీంతో వచ్చే WCలోనూ ఇదే రిపీట్ అవుతుందా? లేదా IND/SL ఈ పరంపరకు స్వస్తి చెబుతాయా అని క్రీడాభిమానులు చర్చించుకుంటున్నారు.

Similar News

News December 21, 2025

రవితేజ కీలక నిర్ణయం!

image

వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరో రవితేజ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో ‘మాస్ మహారాజా’ ట్యాగ్‌ను ఉపయోగించవద్దని సూచించినట్లు డైరెక్టర్ కిశోర్ తిరుమల వెల్లడించారు. మరోవైపు ఈ మూవీకి ఇప్పటివరకు ఆయన ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని నిర్మాత సైతం వెల్లడించారు. వచ్చే నెల 13న విడుదల కానున్న ఈ మూవీ రవితేజకు హిట్టు లోటు తీరుస్తుందేమో చూడాలి.

News December 21, 2025

పడుకునే ముందు ఇవి తింటే?

image

లవంగాన్ని రోజు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పడుకునే ముందు ఒక లవంగాన్ని తినడం లేదా నానబెట్టిన నీరు తాగితే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుందని అంటున్నారు. దీనిలోని యాంటీమైక్రోబయల్ లక్షణాలే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఒత్తిడిని తగ్గించి, మంచి నిద్రకు సాయపడుతుందంటున్నారు. ఎక్కువ మోతాదులో తీసుకోకపోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.

News December 20, 2025

త్వరలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ!

image

TG: కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్‌’తో దేశంలోని పలు రాష్ట్రాలు మావోయిస్టు రహితంగా మారుతున్నాయి. తెలంగాణ అదే బాటలో పయనిస్తోందని పోలీసులు తెలిపారు. ఈ ఏడాది అత్యధికంగా 509 మంది మావోలు రాష్ట్రంలో లొంగిపోయారని వెల్లడించారు. రాష్ట్రం నుంచి ఇంకా పోలీసుల రికార్డుల్లో ఉన్నది 21 మంది మాత్రమేనని పేర్కొన్నారు. దీంతో ఇప్పటికే మావో రహిత రాష్ట్రంగా ప్రకటించుకున్న మధ్యప్రదేశ్ సరసన TG చేరే అవకాశముంది.