News April 18, 2024

T20 WC: దూబేపై ‘ఇంపాక్ట్’ దెబ్బ!

image

CSK ఆల్‌రౌండర్ శివమ్ దూబే T20 WC ఆడే భారత జట్టులో ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అతడిని ‘ఇంపాక్ట్’ రోల్ కలవరపెడుతోంది. 6మ్యాచుల్లో 242రన్స్‌తో CSK టాప్ స్కోరర్‌గా ఉన్న దూబే పేస్ బౌలింగ్ చేయగలరు. అయితే.. అతడిని ఇంపాక్ట్ ప్లేయర్‌ కింద పంపిస్తూ కేవలం బ్యాటింగ్‌‌కే పరిమితం చేస్తున్నారు. దీంతో ఆల్‌రౌండర్ల కోటాలో T20WC ఆడే అవకాశాలు సన్నగిల్లుతున్నాయని క్రీడావిశ్లేషకులు చెబుతున్నారు.

Similar News

News January 15, 2025

గేమ్ ఛేంజర్ NETT కలెక్షన్స్ ఎంతంటే?

image

రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా 5 రోజుల్లో ₹100కోట్ల NETT కలెక్షన్స్ సాధించినట్లు ఇండియా టుడే తెలిపింది. తొలి రోజు ₹51కోట్లు, తర్వాతి 4 రోజుల్లో వరుసగా ₹21.6కోట్లు, ₹15.9కోట్లు, ₹7.65కోట్లు, ₹10 కోట్లు వసూలు చేసిందని పేర్కొంది. మొత్తం <<15125676>>NETT<<>> వసూళ్లు ₹106.15 అని పేర్కొంది. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈనెల 10న థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.

News January 15, 2025

BIG BREAKING: KTRకు షాక్.. క్వాష్ పిటిషన్ డిస్మిస్

image

ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో పూర్తిస్థాయిలో విచారణ జరగాలని న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో కేటీఆర్ ఈ కేసులో విచారణ ఎదుర్కోనున్నారు. ఇప్పటికే ఏసీబీ ఒకసారి ఆయన్ని విచారించింది.

News January 15, 2025

‘గేమ్ ఛేంజర్’ పైరసీ.. నిర్మాత ఆవేదన

image

‘గేమ్ ఛేంజర్’ రిలీజైన నాలుగైదు రోజుల్లోనే బస్సుల్లో, కేబుల్ ఛానల్స్‌లో ప్రసారమవడం ఆందోళన కలిగిస్తోందని నిర్మాత SKN ట్వీట్ చేశారు. ‘సినిమా అంటే కేవలం హీరో, దర్శకుడు, నిర్మాతలే కాదు. ఇది 3-4 ఏళ్ల కృషి, అంకితభావం, వేలాది మంది కలల ఫలితం. ఇవి చిత్ర పరిశ్రమ భవిష్యత్తుకు ముప్పు. ప్రభుత్వాలు దీనికి ముగింపు పలికేలా కఠిన చర్యలు తీసుకోవాలి. సినిమాను బతికించుకునేందుకు ఏకమవుదాం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.