News June 5, 2024
T20 WC: టాస్ గెలిచిన భారత్.. టీమ్ ఇదే

టీ20 వరల్డ్ కప్లో ఐర్లాండ్తో మ్యాచ్లో టీమ్ ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్: రోహిత్ (C), కోహ్లీ, పంత్, సూర్య, శివమ్ దూబే, హార్దిక్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, సిరాజ్, బుమ్రా, అర్ష్దీప్.
ఐర్లాండ్: ఆండీ బల్బిర్నీ, పాల్ స్టిర్లింగ్ (C), టక్కర్, హ్యారీ టెక్టార్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, మెక్కార్తీ, బెన్ వైట్, జోష్ లిటిల్.
Similar News
News December 2, 2025
ADB: అసలు మీరు ఏ వర్గం రా బాబూ..!

పంచాయతీ ఎన్నికల వేళ పార్టీలోకి ఫిరాయింపులు, చేరికలు జోరందుకున్నాయి. పలువురు నాయకులు ఓవైపు అధికార పార్టీ నాయకులతో సంప్రదింపులు జరుపుతూ, మరోవైపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నాయకులతో అంట కాగుతున్నారు. ఉదయం ఒక పార్టీ కండువా వేసుకుని.. సాయంత్రం మరో పార్టీలో చేరుతున్న ఘటనలు చేసుకుంటున్నాయి. ఇది చూసిన పలువురు మీరు ఏ వర్గం రా బాబు అంటూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. మీ ప్రాంతంలోనూ ఇలాగే జరుగుతోందా కామెంట్ చేయండి.
News December 2, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.280 తగ్గి రూ.1,30,200కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.250 పతనమై రూ.1,19,350 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,96,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 2, 2025
గొర్రెలకు సంపూర్ణ ఆహారం ఎలా అందుతుంది?

గొర్రెలకు మాంసకృత్తులు, క్రొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు, విటమిన్లతో కూడిన సంపూర్ణ దాణా(ఆహారం) అందేలా జాగ్రత్త వహించాలి. అప్పుడే గొర్రె మందలు ఆరోగ్యంగా పెరుగుతాయి. మంచి దాణా వల్ల గొర్రెల్లో పునరుత్పత్తి సామర్థ్యం పెరిగి వాటి మందలు వృద్ధిచెంది, పెంపకందారులకు అధిక ఆదాయం అందిస్తాయి. సరైన పోషకాహారం అందని తల్లి గొర్రెల వద్ద పిల్లలకు సరిపోను పాలుండకపోతే పిల్లలు సరిగా ఎదగక మరణిస్తాయి.


