News May 18, 2024
T20 WC వచ్చేస్తోంది.. ఫామ్లోకి వచ్చేయండి!
IPL-2024 పూర్తికాగానే జూన్ 2 నుంచి టీ20 వరల్డ్ కప్ మొదలుకానుంది. అయితే, భారత ప్లేయర్లు ఫామ్లో లేకపోవడం అభిమానులను కలవరపెడుతోంది. నిన్నటి మ్యాచ్లో రోహిత్ కాస్త మెరుగవగా.. సూర్యకుమార్ డకౌట్ అయ్యారు. హార్దిక్ IPL మొత్తంలోనూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. లీగ్ మ్యాచుల్లో ఐర్లాండ్, కెనడా, USA జట్లపై టీమ్ఇండియా సునాయసంగా గెలుస్తుందని ఆ లోపు ఫామ్ అందుకోవాలని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
Similar News
News December 22, 2024
‘పీలింగ్స్’ సాంగ్లో నటించేందుకు ఇబ్బంది పడ్డా: రష్మిక మందన్న
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ మూవీలోని ‘పీలింగ్స్’ సాంగ్లో నటించేందుకు తొలుత ఇబ్బంది పడ్డానని హీరోయిన్ రష్మిక మందన్న తెలిపారు. ‘పుష్ప 2 సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందే పీలింగ్స్ సాంగ్ షూటింగ్ ప్రారంభించాం. ఎవరైనా నన్ను ఎత్తుకుంటే నాకు భయం. అల్లు అర్జున్ నన్ను ఎత్తుకుని డాన్స్ చేశారు. ముందు కొంచెం భయంగా, అసౌకర్యంగా అనిపించింది. కానీ డైరెక్టర్ చెప్పినట్లు చేసేశా’ అని ఆమె చెప్పుకొచ్చారు.
News December 22, 2024
GST నిర్ణయాలు: ధర పెరిగేవి, తగ్గేవి ఇవే
ధరలు తగ్గేవి: ప్రజా పంపిణీ వ్యవస్థలో ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ *జన్యు చికిత్సలకు చేసే జీన్ థెరపీ *ప్రభుత్వ పథకాల కింద ఆహార పంపిణీకి వాడే ముడి సరుకులు *రైతులు నేరుగా విక్రయించే మిరియాలు, ఎండుద్రాక్షపై నో GST. ధరలు పెరిగేవి: పాత వాహనాల అమ్మకాలు *రెడీ2ఈట్ పాప్కార్న్ *కార్పొరేట్ స్పాన్సర్షిప్ సేవలు *ఆటోక్లేవ్డ్ ఎరేటెడ్ కాంక్రీట్ బ్లాక్స్లో 50+% ఫ్లై యాష్ ఉంటే అధిక GST.
News December 22, 2024
లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తాం: మంత్రి
AP: రాష్ట్రంలో ఉచిత బస్సు పథకాన్ని ఎవరూ వేలెత్తి చూపించకుండా అమలు చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఒకటో తేదీన ప్రారంభించి 16న మూసేయడం తమకు ఇష్టం లేదన్నారు. కాస్త లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తామని డైలాగ్ వేశారు. పథకం అమలయ్యేనాటికి సమస్యలను అధిగమించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. త్వరలో 1400 బస్సులను అందుబాటులోకి తెస్తామని, ఆ తర్వాత మరో 2000 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తామన్నారు.