News June 11, 2024
T20 WC: పాకిస్థాన్ ఇవాళ ఓడితే కష్టమే!
టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పాకిస్థాన్ ఇంకా గెలుపు ఖాతానే తెరవలేదు. ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. సూపర్-8 చేరాలంటే ఇవాళ రా.8 గం.కు కెనడాతో జరిగే మ్యాచ్‌లో PAK భారీ విజయం సాధించాలి. 16న ఐర్లాండ్‌పైనా భారీ తేడాతో గెలవాలి. అదేసమయంలో USA తన తదుపరి 2 మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. అప్పుడు చెరో 4 పాయింట్లతో ఉంటాయి. నెట్ రన్‌రేట్ కీలకమవుతుంది. ప్రస్తుతం USA +0.626, పాక్ -0.150 రన్‌రేట్ కలిగి ఉన్నాయి.
Similar News
News December 25, 2024
తిరుమల మెట్లపై 12 అడుగుల కొండచిలువ.. భయంతో భక్తుల పరుగులు
సాధారణంగా చిన్నపామును చూస్తేనే భయంతో వణికిపోతాం. అలాంటిది 12 అడుగుల కొండచిలువను చూసి తిరుమల భక్తులు పరుగులు తీశారు. ఇవాళ మధ్యాహ్నం తిరుమల మెట్ల మార్గంలో పెద్ద కొండచిలువ భక్తుల కంటపడింది. దీంతో వెంటనే టీటీడీ ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి ఆ సర్పాన్ని సేఫ్‌గా అడవిలో వదిలిపెట్టారు. తిరుమలేశుడి నెలవైన శేషాచలం అడవుల్లో ఎన్నో జీవరాశులున్నాయి.
News December 25, 2024
నితీశ్, నవీన్‌కు భారతరత్న దక్కాలి: కేంద్రమంత్రి
భారతరత్న పురస్కారానికి బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ అర్హులని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘వారిద్దరూ తమ రాష్ట్రాల్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నారు. ప్రజలకు ఎంతో సేవ చేశారు. వారికి భారతరత్న వంటి అవార్డులు దక్కడం సముచితం. బిహార్‌లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో నితీశ్ నేతృత్వంలో మళ్లీ ఎన్డీయే సర్కారే వస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.
News December 25, 2024
రేపు సీఎం రేవంత్‌తో భేటీ అయ్యే సినీ ప్రముఖులు వీరే!
TG: CM రేవంత్‌తో రేపు ఉ.10 గంటలకు సినీ ప్రముఖులు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో భేటీ కానున్నారు. వీరిలో అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అరవింద్ కూడా ఉన్నారు. అలాగే చిరంజీవి, వెంకటేశ్, దిల్ రాజు తదితరులు పాల్గొంటారు. ప్రభుత్వం తరఫున మంత్రులు భట్టి, కోమటిరెడ్డి, ఉత్తమ్, రాజనర్సింహ హాజరవుతారు. రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదని CM ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.