News June 22, 2024
T20 WC: అత్యధిక సిక్సర్ల రికార్డ్ బద్దలు

విండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్ ఒక వరల్డ్ కప్ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా నిలిచారు. ఈ సీజన్లో ఇప్పటివరకు పూరన్ 17 సిక్సర్లు బాదారు. దీంతో గేల్ (16) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టారు. ఆ తర్వాతి స్థానాల్లో శామ్యూల్స్-15(2012), వాట్సన్-15(2012) ఉన్నారు.
Similar News
News October 21, 2025
బొద్దింకను చంపబోయి మహిళ చావుకు కారణమైంది!

దక్షిణ కొరియాలో యువతి చేసిన పిచ్చి పని ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. ఒసాన్ నగరంలో తన ఇంట్లోకి వచ్చిన బొద్దింకను చంపేందుకు లైటర్, స్ప్రేను ఉపయోగించింది. ఈ క్రమంలో తన ఫ్లాట్‌కే నిప్పుపెట్టుకుంది. తర్వాత మంటలు మొత్తం అపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయి. ఈ ఘటనలో పొరుగున ఉండే మహిళ చనిపోగా, ఆమె భర్త, 2 నెలల చిన్నారి ప్రాణాలతో బయటపడ్డారు. 30కిపైగా నివాసాలున్న బిల్డింగ్‌లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
News October 21, 2025
రేపట్నుంచి UAEలో చంద్రబాబు పర్యటన

AP: పెట్టుబడుల సాధన కోసం CM CBN రేపట్నుంచి 3 రోజుల పాటు UAEలో పర్యటించనున్నారు. తొలుత దుబాయ్‌లో CII నిర్వహించే రోడ్‌షోలో పాల్గొంటారు. శోభా, లోధా, షరాఫ్ డీజీ గ్రూపులు, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థల అధిపతులతో భేటీ అవుతారు. 24న AP NRT చేపట్టే తెలుగు డయాస్పోరా సదస్సుకు హాజరవుతారు. యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులతోనూ CBN చర్చిస్తారు. NOV 14, 15 తేదీల్లో జరిగే VSP సమ్మిట్‌కు ఆయా సంస్థలను ఆహ్వానించనున్నారు.
News October 21, 2025
నేవీ చిల్డ్రన్ స్కూల్లో ఉద్యోగాలు

నేవీ చిల్డ్రన్ స్కూల్ 8 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు నవంబర్ 6వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీజీ, డిగ్రీ, బీఈడీ, డిప్లొమాతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. వయసు 21 నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డెమాన్‌స్ట్రేషన్ క్లాస్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100. వెబ్సైట్: https://ncsdelhi.nesnavy.in/