News October 5, 2024

టీ20 WC: భారత్ సెమీస్ చేరాలంటే?

image

మహిళల టీ20 WCలో నిన్న కివీస్ చేతిలో ఓడిన టీమ్‌ఇండియా -2.900 NRRతో గ్రూప్-Aలో చివరి స్థానంలో ఉంది. సెమీస్ చేరాలంటే మిగతా 3 మ్యాచులు (PAK, SL, AUS) గెలవడంతో పాటు బెటర్ రన్ రేట్ సాధించాలి. లేదంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. బలమైన AUS టీమ్ ఎలాగో SFకి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. భారత్ SF చేరాలంటే AUS మినహా మిగతా 3 జట్లు రెండేసి మ్యాచులు ఓడాలి. వాటి NRR మనకంటే తక్కువుండాలి.

Similar News

News November 8, 2025

ధ్రువ్ జురెల్ మరో సెంచరీ

image

సౌతాఫ్రికా-Aతో జరుగుతోన్న రెండో అన్‌అఫీషియల్ టెస్టులో ఇండియా-A బ్యాటర్ ధ్రువ్ జురెల్ అద్భుతంగా ఆడుతున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 132* రన్స్ చేసిన ఆయన, సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ బాదారు. తొలి ఇన్నింగ్స్‌లో IND-A 255, SA-A 221 స్కోర్ చేశాయి. రెండో ఇన్నింగ్స్‌లో ప్రస్తుతం భారత్ స్కోర్ 355-6గా ఉంది. జురెల్ (117*), పంత్ (48*) క్రీజులో ఉన్నారు.

News November 8, 2025

48 మంది ఎమ్మెల్యేలపై CBN సీరియస్

image

AP: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్లు, CMRF చెక్కుల పంపిణీలో పాల్గొనడం లేదని మండిపడ్డారు. ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ కోరాలని పార్టీ కేంద్ర కార్యాలయం సభ్యులతో సమావేశం సందర్భంగా ఆదేశించారు. పెన్షన్ల పంపిణీలో మంత్రులు, MLAలు పాల్గొనాల్సిందే అని చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే నచ్చిన కార్యకర్తలనే కాకుండా పార్టీ కోసం కష్టపడేవారిని గుర్తించాలన్నారు.

News November 8, 2025

వివేకా హత్య కేసు.. ఇద్దరు పోలీసులపై కేసులు నమోదు

image

AP: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇద్దరు పోలీసు అధికారులపై కేసులు నమోదయ్యాయి. రాజుపాలెం పీఎస్ ఏఎస్సై రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వివేకా హత్య వ్యవహారంలో గతంలో వీరు తప్పుడు కేసులు నమోదు చేశారని పులివెందులకు చెందిన కుళాయప్ప అనే వ్యక్తి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.