News February 2, 2025
T20 WC: 82కే సౌతాఫ్రికా ఆలౌట్
అండర్-19 ఉమెన్స్ టీ20 WC ఫైనల్లో భారత బౌలర్లు విజృంభించారు. దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌటైంది. తెలుగమ్మాయి త్రిష 3 వికెట్లతో సత్తా చాటారు. ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ, పరుణిక రెండేసి వికెట్లతో ఆకట్టుకున్నారు. భారత విజయలక్ష్యం 83.
Similar News
News February 2, 2025
గచ్చిబౌలి కాల్పుల కేసు.. నిందితుడి వద్ద 460 బుల్లెట్లు
TG: గచ్చిబౌలి <<15334177>>కాల్పుల కేసులో<<>> కీలక విషయాలు వెలుగుచూశాయి. నిందితుడు ప్రభాకర్ గదిలో పోలీసులు మూడో గన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రభాకర్ వద్ద 460 బుల్లెట్లు లభించాయి. బిహార్ నుంచి వీటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రభాకర్ తన సాఫ్ట్ వేర్ స్నేహితుడి గదిలో ఉంటున్నట్లు గుర్తించారు. గతంలో ఓ కేసులో జైలుకు వెళ్లిన అతను తోటి ఖైదీని చంపేందుకు ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు.
News February 2, 2025
ప్రపంచ జనాభా.. బ్లడ్ గ్రూపుల వారీగా
O+: 42 శాతం
A+: 31 శాతం
B+: 15 శాతం
AB+: 5 శాతం
O-: 3 శాతం
A-: 2.5 శాతం
B-: 1 శాతం
AB-: 0.5 శాతం
**మరి మీది ఏ గ్రూప్..? కామెంట్ చేయండి.
News February 2, 2025
SO SAD.. దక్షిణాఫ్రికాకు మరోసారి హార్ట్ బ్రేక్
అంతర్జాతీయ టోర్నమెంట్లలో దక్షిణాఫ్రికాకు అస్సలు కలిసి రావడం లేదు. ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్లో విజయం వారికి మరోసారి అందని ద్రాక్షగానే మిగిలింది. తాజాగా U19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ చేతిలో పరాజయం పాలైంది. దీంతో ఆ జట్టు ప్లేయర్లు కన్నీరుపెట్టుకున్నారు. ఏడాది వ్యవధిలోనే సీనియర్స్ మహిళల, పురుషుల T20 WC ఫైనల్స్లోనూ ఓడిపోయిన సంగతి తెలిసిందే. మరి WTC ఫైనల్లోనైనా గెలుస్తుందేమో చూడాలి.