News June 3, 2024
T20 WC: టీ20ల్లో శ్రీలంకకు అత్యల్ప స్కోర్

టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచులో శ్రీలంక 77 రన్స్‌కే కుప్పకూలింది. ఆ జట్టు బ్యాటర్లలో కుశాల్ మెండిస్ (19) టాప్ స్కోరర్‌గా నిలిచారు. సౌతాఫ్రికా బౌలర్లలో అన్రిచ్ నోకియా 4, కేశవ్ మహరాజ్ 2, రబాడ 2 వికెట్లు తీయగా, బార్ట్‌మన్ ఒక వికెట్ పడగొట్టారు. టీ20ల్లో శ్రీలంకకు ఇదే అత్యల్ప స్కోర్.
Similar News
News October 9, 2025
APPLY NOW: IPRCLలో 28 ఉద్యోగాలు

ఇండియన్ పోర్ట్ రైల్ అండ్ రోప్‌వే కార్పొరేషన్ లిమిటెడ్(IPRCL)లో 28 పోస్టులకు దరఖాస్తు చేయడానికి రేపే ఆఖరు తేదీ(OCT 10). వీటిలో 18 ప్రాజెక్ట్ సైట్ ఇంజినీర్ పోస్టులు, 10 అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి. బీటెక్, బీఈ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రాజెక్ట్ సైట్ ఇంజినీర్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 32ఏళ్లు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://iprcl.in/
News October 9, 2025
కనకాంబరంలో ఆకుమచ్చ తెగులు

కనకాంబరం పంటను ఆశించే చీడపీడల్లో ఆకుమచ్చ తెగులు ఒకటి. ఆకుమచ్చ తెగులు సోకిన కనకాంబరం మొక్క ఆకు పైభాగంలో చిన్న, గుండ్రని పసుపు పచ్చ మచ్చలు ఏర్పడి.. తర్వాత గోధుమ రంగులోకి మారతాయి. తెగులు సోకిన ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. దీని వల్ల మొక్క ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. ఈ తెగులు నివారణకు 2.5గ్రా మాంకోజెబ్‌ను లీటర్ నీటికి కలిపి ఆకులన్నీ తడిచేలా పిచికారీ చేయాలి.
News October 9, 2025
సఖి సురక్ష పథకం ఎందుకంటే?

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఏపీ ప్రభుత్వం సఖి సురక్ష కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఇందులో భాగంగా 35 ఏళ్లు పైబడిన మహిళలకు బీపీ, షుగర్, థైరాయిడ్, రక్తహీనతతో పాటు గర్భాశయ సమస్యలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవగాహన కల్పిస్తారు. పట్టణ మహిళల ఆరోగ్యస్థితిని పర్యవేక్షించేందుకు డిజిటల్ హెల్త్ రికార్డులు ఉంటాయి. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు ఆరోగ్యపరంగా చైతన్యం పొందుతారని అధికారులు వెల్లడిస్తున్నారు.