News June 29, 2024
T20 WC: ఫస్ట్ బ్యాటింగ్ చేసే జట్టుదే విజయం?

T20WC ఫైనల్ మ్యాచ్ బార్బోడస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో నేడు జరగనుంది. T20 చరిత్రలో ఇప్పటివరకు ఇక్కడ మొత్తం 50మ్యాచులు జరగగా, 31మ్యాచుల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ల యావరేజ్ 138, సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ల సగటు 125గా ఉంది. అత్యధిక స్కోరు 224/5, అత్యల్ప స్కోరు 43గా నమోదైంది. ఛేదించిన అత్యధిక స్కోర్ 172/6 కాగా, డిఫెండ్ చేసుకున్న లోయెస్ట్ స్కోర్ 106/8గా ఉంది.
Similar News
News December 25, 2025
95 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

<
News December 25, 2025
రష్యాలో క్రిస్మస్ ఎప్పుడో తెలుసా?

ప్రపంచమంతటా ఇవాళ క్రిస్మస్ జరుపుకుంటున్నారు. రష్యా మాత్రం జనవరి 7న సెలబ్రేట్ చేసుకుంటుంది. దీనికో ప్రత్యేక కారణం ఉంది. 1582లో యూరప్ దేశాలు గ్రెగోరియన్ క్యాలెండర్ అనుసరించడం ప్రారంభించాయి. కానీ రష్యా ఆర్థడాక్స్ చర్చ్ జులియన్ క్యాలెండర్‌ను ఫాలో కావడం కొనసాగించింది. ఏళ్లు గడిచే కొద్దీ ఈ క్యాలెండర్ల మధ్య గ్యాప్ వచ్చింది. దీంతో Jan 7(జులియన్ క్యాలెండర్లో Dec 25)న రష్యా క్రిస్మస్ జరుపుకుంటుంది.
News December 25, 2025
కోహ్లీ క్రేజ్.. VHT స్కోర్ కోసం 10 లక్షల సెర్చ్‌లు

కోహ్లీ, రోహిత్ లాంటి స్టార్లు ఆడుతున్న విజయ్ హజారే ట్రోఫీ ప్రత్యక్ష ప్రసారం లేకపోవడంతో అభిమానులు గూగుల్‌ను ఆశ్రయించారు. ముఖ్యంగా కోహ్లీ లైవ్ స్కోర్ తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపారు. 10 గంటల వ్యవధిలో ఢిల్లీ-ఆంధ్రా మ్యాచ్ అప్డేట్స్ కోసం 10 లక్షలకు పైగా సెర్చ్‌లు నమోదయ్యాయి. ఏకంగా 1,81,818 సార్లు రీఫ్రెష్ చేశారు. నిన్నటి మ్యాచ్‌లో కింగ్ 101 బంతుల్లో 131 రన్స్ చేసిన విషయం తెలిసిందే.


