News March 20, 2024
న్యూయార్క్‌లో టీ20 WC ట్రోఫీ ఆవిష్కరణ

టీ20 వరల్డ్‌కప్ 2024 ట్రోఫీని ఐసీసీ ఆవిష్కరించింది. న్యూయార్క్‌లోని అంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై విండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్, USA బౌలర్ అలీ ఖాన్ కలిసి ట్రోఫీని ఆవిష్కరించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్‌లో టీ20 WC జరగనుంది. మొత్తం 20 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. జూన్ 6న ఐర్లాండ్‌తో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది.
Similar News
News November 19, 2025
హసీనాకు మరణశిక్ష.. కుమారుడి స్పందనిదే..

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు <<18311087>>మరణశిక్ష<<>> విధిస్తూ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ తీసుకున్న నిర్ణయంపై ఆమె కుమారుడు సాజిబ్ వాజీద్ స్పందించారు. కేసుల విచారణలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం న్యాయ ప్రక్రియను పాటించలేదని ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ మార్పుకు జో బైడెన్ సర్కారు మిలియన్ డాలర్లు వెచ్చించిందని విమర్శించారు. అయితే, ట్రంప్ ప్రభుత్వ వైఖరి వేరుగా ఉందని సాజిబ్ అభిప్రాయపడ్డారు.
News November 19, 2025
బి.టి పత్తికి గులాబీ రంగు పురుగుతో ముప్పు

బి.టి పత్తిని నవంబర్, డిసెంబర్ నెలలో గులాబీ రంగు పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగు చిన్న లార్వాలు పూమొగ్గలు, లేతకాయలకు చిన్న రంద్రాలు చేసి లోపలకి ప్రవేశిస్తాయి. పూలలోని మొగ్గలను తినేయడం వల్ల పూలు విచ్చుకోవు. కాయల లోపలి భాగాన్ని తినేయడం వల్ల కాయ ఎదగదు. అలాగే ఇవి కాయల్లోని విత్తనం లోపలి భాగాన్ని, దూదిని కొరికి తినడం వల్ల దూది నాణ్యత తగ్గి రంగు కూడా మారుతుంది. ఫలితంగా దిగుబడి, రాబడి తగ్గుతుంది.
News November 19, 2025
పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణ ఎలా?

పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణకు లీటరు నీటికి థయోడికార్బ్1.5 మి.లీ (లేదా) ప్రొఫెనోఫాస్ 2 మి.లీ. (లేదా) క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. కలిపి పిచికారి చేసుకోవాలి. పత్తి పంట చివరి దశలో ఉన్నట్లైతే ఒక లీటరు నీటికి సింథటిక్ పైరిత్రాయిడ్ మందులైన సైపర్ మిత్రిన్ 25% ఇసి 1.0 మి.లీ. (లేదా) థయోమిథాక్సామ్ + లామ్డా సైహలోత్రిన్ 0.4 మి.లీ. (లేదా) సైపర్‌మెథ్రిన్ + క్లోరిపైరిఫాస్ 2 మి.లీ. కలిపి పిచికారి చేసుకోవాలి.


