News March 21, 2024
T20 WC: వికెట్ కీపర్‌గా ఛాన్స్ దక్కేదెవరికి?
జూన్‌లో జరిగే T20 WCలో వికెట్ కీపర్‌గా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై BCCI దృష్టి సారించింది. ఈ స్థానం కోసం KL రాహుల్, పంత్, జురెల్, శాంసన్, జితేశ్ పోటీ పడుతున్నారు. ఫిట్నెస్తో పాటు ఫామ్‌లో ఉన్నవారిని తీసుకోవాలని సెలక్టర్లు భావిస్తున్నారట. పంత్ వైపే మేనేజ్మెంట్ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. కానీ అతను తన ఫామ్‌ను నిరూపించుకోవాల్సి ఉంది. IPLలో ప్రదర్శన ఆధారంగానే WK ఎంపిక ఉండనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 8, 2025
ఆ సినిమా చేసినందుకు చింతిస్తున్నా: రామ్ చరణ్
‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదల నేపథ్యంలో హీరో రామ్ చరణ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో ఏ మూవీ చేసినందుకు చింతిస్తున్నారో తెలిపారు. జంజీర్ సినిమాను రీమేక్‌గా చేసినందుకు చింతిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ సినిమాను తెలుగులో ‘తుఫాన్’గా విడుదల చేశారు. ఇందులో చరణ్, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో నటించారు. 1973లో రిలీజైన ‘జంజీర్’లో అమితాబ్ బచ్చన్ నటించారు.
News January 8, 2025
పిల్లలొద్దు.. పెట్సే ముద్దంటున్నారు!
ఇండియాలో జననాల రేటు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ఈక్రమంలో మార్స్ పెట్‌కేర్ నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. ఇండియాలో జనరేషన్ Z& మిలీనియల్స్‌కు చెందిన 66శాతం మంది పెంపుడు జంతువులను కుటుంబసభ్యులుగా భావిస్తున్నారు. వీరు ‘పెట్ పేరెంటింగ్’ను స్వీకరించడంతో జంతువుల సంరక్షణ పరిశ్రమ అభివృద్ధి చెందినట్లు పేర్కొంది. పట్టణ జీవితంలో ఒత్తిడి తగ్గించేందుకు ఇదో పరిష్కారంగా భావిస్తున్నారంది.
News January 8, 2025
LRS పేరిట డబ్బులు దండుకోవాలని చూస్తున్నారు: హరీశ్
TG: LRSపై త్వరలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్న మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై హరీశ్ రావు స్పందించారు. ఫ్రీగా అమలు చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ పేరిట డబ్బులు దండుకునేందుకు సిద్ధమవడం సిగ్గుచేటని విమర్శించారు. ‘రియల్ ఎస్టేట్ త్వరలో పుంజుకుంటుందని స్వయంగా రెవెన్యూ మంత్రే అన్నారు. అంటే రియల్ ఎస్టేట్ కుదేలైందనే కదా అర్థం. దీనిపై కాంగ్రెస్ నేతలు ఏం చెబుతారు?’ అని ప్రశ్నించారు.