News April 30, 2024
T20 World Cup: నేడే తుది జట్టు ప్రకటన?
టీ20 వరల్డ్ కప్‌నకు భారత జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జట్టు ప్రకటనకు రేపే తుదిగడువు కావడంతో ఈరోజే టీమ్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఎంపిక విషయంలో సెలక్టర్లు ఐపీఎల్ ప్రదర్శనపై మరీ ఎక్కువగా దృష్టి పెట్టకపోవచ్చని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. సెలక్టర్లు ఇప్పటికే 2 రోజులుగా ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్నారు. అంతర్జాతీయంగా అనుభవం కలిగిన ప్లేయర్లవైపే వారు మొగ్గు చూపొచ్చని సమాచారం.
Similar News
News December 28, 2024
RECORD:10 నిమిషాలకో ₹50L కారు అమ్మకం
సంపద, సంపన్నులు పెరగడంతో లగ్జరీ కార్ల అమ్మకాల్లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. 2024లో ప్రతి 10 నిమిషాలకో ₹50L పైబడిన కారును అమ్మింది. తొలిసారి ఒక ఏడాదిలో 50వేల లగ్జరీ కార్ల ఘనతను అందుకుంది. 2025లో 54వేలకు చేరుతుందని ఇండస్ట్రీ వర్గాల అంచనా. 2024లో మెర్సిడెస్ బెంజ్ 20వేలు, BMW 12వేల కార్లను అమ్మినట్టు సమాచారం. ఇవి సగటున 15% గ్రోత్ నమోదు చేశాయి. వివిధ కారణాలతో AUDI కార్ల సేల్స్ 16% తగ్గాయి.
News December 28, 2024
BREAKING: కేటీఆర్‌కు ఈడీ నోటీసులు
TG: ఫార్ములా- ఈ రేసింగ్ కేసులో కేటీఆర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7న కేటీఆర్ విచారణకు హాజరుకావాలని కోరింది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని పేర్కొంది. ఫార్ములా-ఈ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని కేటీఆర్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
News December 28, 2024
రూ.6,000 కోట్ల పోంజీ స్కామ్.. నిందితుడు అరెస్ట్
రూ.6వేల కోట్ల పోంజీ స్కామ్ ప్రధాన నిందితుడు భూపేంద్రసింగ్‌ను సీఐడీ అరెస్టు చేసింది. గుజరాత్ మెహసానా జిల్లాలోని ఓ గ్రామంలో దాక్కున్న అతడిని ఎట్టకేలకు అదుపులోకి తీసుకుంది. బీజడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో అయిన ఇతను బ్యాంకుల కన్నా అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి వేలాది మందిని మోసం చేశారు. కొన్ని నెలలుగా అతను సీఐడీకి దొరక్కుండా తిరుగుతున్నారు.