News October 13, 2024
T20 వరల్డ్ కప్: టీమ్ ఇండియా లక్ష్యం 152 రన్స్

టీ20 వరల్డ్ కప్లో భారత్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 151/8 స్కోరు చేసింది. టోర్నీలో నిలవాలంటే ఇది భారత్కు చావో రేవో లాంటి మ్యాచ్ కావడం గమనార్హం. ఆసీస్ బ్యాటర్లలో గ్రేస్ హారిస్ 40 రన్స్, టాహ్లియా, పెర్రీ చెరో 32 పరుగులు చేశారు. భారత అమ్మాయిల్లో రేణుక, దీప్తి చెరో 2 వికెట్లు, శ్రేయాంక, పూజ, రాధా యాదవ్ తలో వికెట్ తీశారు.
Similar News
News December 1, 2025
విజయ్ నాకు శత్రువు కాదు: కమల్ హాసన్

TVK అధినేత విజయ్ తనకు శత్రువు కాదని సినీ నటుడు, MP కమల్ హాసన్ అన్నారు. కులతత్వమే తన ప్రధాన శత్రువని, దాన్ని అంతమొందించాలని చెప్పారు. కేరళలో నిర్వహించిన హార్టస్ ఆర్ట్, లిటరేచర్ ఫెస్టివల్లో ఆయన మాట్లాడారు. ‘విజయ్కు సలహా ఇచ్చే స్థితిలో నేను లేను. ఇది సరైన సమయం కాదు. అనుభవం మన కన్నా గొప్ప టీచర్. అది నేర్పే పాఠాలు ఎవరూ నేర్పలేరు. మనకు పక్షపాతం ఉండొచ్చు, కానీ అనుభవానికి ఉండదు’ అని తెలిపారు.
News December 1, 2025
ఇవాళ ఏలూరు జిల్లాలో సీఎం పెన్షన్ల పంపిణీ

AP: సీఎం చంద్రబాబు ఇవాళ ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని గోపీనాథపట్నంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సామాజిక పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. అటు నల్లమాడులో P4 మార్గదర్శకులు, బంగారు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం ఉంగుటూరులో పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేయడానికి ముఖ్య నేతలతో CM భేటీ కానున్నారు. 3.35PMకు జిల్లా పర్యటన ముగించుకొని ఉండవల్లి నివాసానికి బయల్దేరతారు.
News December 1, 2025
నేడు ఇలా చేస్తే సకల సౌభాగ్యాలు

నేడు ఏకాదశి. ఈ పవిత్ర దినాన కొన్ని పరిహారాలు పాటిస్తే సకల సౌభాగ్యాలు, ఐశ్వర్యాలు పొందుతారని పండితులు చెబుతున్నారు. ‘నేడు ఉపవాసం ఉండాలి. దేవుడి స్మరణలో కాలం గడపాలి. వీలైతే నదీ స్నానం, లేకపోతే నదీజలం కలిసిన నీటితో స్నానం చేయాలి. ఆవునేతితో దీపం పెట్టి లక్ష్మీదేవిని పూజించాలి. వైష్ణవాలయానికి వెళ్లాలి. మరుసటి రోజు ద్వాదశి తిథిన దీక్ష విరమించాలి. ఫలితంగా విష్ణుమూర్తి,లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది.’


