News June 12, 2024
T20 ప్రపంచకప్.. 5.4 ఓవర్లలోనే కొట్టేశారు!

T20 WC: నమీబియాపై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 73 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ కోల్పోయి 5.4 ఓవర్లలోనే ఛేదించింది. మరో 86 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ఫినిష్ చేసింది. హెడ్ (17 బంతుల్లో 34*), వార్నర్ (8 బంతుల్లో 20), మార్ష్ (9 బంతుల్లో 18*) చెలరేగారు. ఈ విజయంతో కంగారూలు సూపర్-8కు క్వాలిఫై అయ్యారు.
Similar News
News January 21, 2026
విశాఖలో కాగ్నిజెంట్ పనులు వేగవంతం చేయండి: లోకేశ్

AP: విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ క్యాంపస్ పనులను వేగవంతం చేయాలని మంత్రి లోకేశ్ ఆ కంపెనీ CEO రవికుమార్ సింగిశెట్టిని కోరారు. దావోస్‌లో ఆయనతో భేటీ అయిన లోకేశ్.. తాత్కాలిక సౌకర్యాల ద్వారా ఉద్యోగుల సంఖ్యను పెంచే అంశాన్ని పరిశీలించాలన్నారు. Ai, క్లౌడ్, డేటా, డిజిటల్ ఇంజినీరింగ్, CTS నియామక అవసరాలకు కాగ్నిజెంట్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో డెడికేటెడ్ సెంట్రలైజ్డ్ స్కిల్లింగ్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని కోరారు.
News January 21, 2026
కేంద్రం కీలక నిర్ణయం.. రైతులకు లాభం

నకిలీ, నాణ్యత లేని పురుగు మందులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకే వీటి తయారీ, విక్రయంపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం సిద్ధమైంది. దీని కోసం ‘పురుగుమందుల నిర్వహణ బిల్లు, 2025’ ముసాయిదాను విడుదల చేసింది. దీని ప్రకారం నకిలీ పురుగు మందులను విక్రయిస్తే రూ.50 లక్షల వరకు జరిమానా, 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే ఛాన్సుంది. కేంద్రం నిర్ణయంలో కీలక అంశాలను తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ క్లిక్<<>> చేయండి.
News January 21, 2026
ఆర్గానిక్ పంటల సర్టిఫికేషన్‌కు యాప్: తుమ్మల

TG: ఐదు జిల్లాల్లో అమలు చేసిన యూరియా యాప్‌ను వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్రం ఈ విధానాన్ని మెచ్చుకుందన్నారు. నకిలీ ఆర్గానిక్ లేబుళ్లతో చలామణి అవుతున్న ఫేక్ ప్రొడక్ట్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఆర్గానిక్ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ఇచ్చేలా ఓ యాప్ తీసుకొస్తామని చెప్పారు. దీంతో పంటను ఎక్కడ, ఎలా పండించారనే వివరాలు తెలుసుకోవచ్చన్నారు.


