News April 30, 2024

T20 World Cup: పాండ్యకు చోటు దక్కేనా..?

image

పొట్టి వరల్డ్‌కప్‌నకు ఆడే భారత టీమ్‌ను సెలక్టర్లు ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య సెలక్ట్ అవుతారా లేదా అన్నది ఆసక్తికరం. జట్టులో ప్రీమియం ఆల్‌రౌండర్‌గా ఉన్న హార్దిక్ ఐపీఎల్‌లో విఫలమవుతున్నారు. ముఖ్యంగా బౌలింగ్‌లో ధారాళంగా పరుగులిస్తున్నారు. అటు బ్యాటింగ్‌లోనూ ఒకట్రెండు మెరుపులు తప్ప నిలకడ లేదు. మరి సెలక్టర్లు అతడి సీనియారిటీని పరిగణిస్తారా లేక పక్కన పెడతారా అన్నది చూడాలి.

Similar News

News March 19, 2026

‘ధురంధర్-2’ రివ్యూ&రేటింగ్

image

రెహమాన్(అక్షయ్)ను హమ్జా(రణ్‌వీర్) చంపాక PAK ఉగ్ర నెట్‌వర్క్‌ను కూల్చేసిన స్పై కథే ధురంధర్-2. హమ్జా గతం, ల్యారీ పీఠం కోసం సాగే ఆధిపత్య పోరు, మైండ్ గేమ్, ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్‌ను డైరెక్టర్ ఆదిత్య ధర్ అద్భుతంగా తెరకెక్కించారు. రణ్‌వీర్ నటనతో విజిల్స్ కొట్టించారు. దేశభక్తి, యాక్షన్ సీన్స్, BGM ప్లస్. హీరోయిన్ సారా పాత్రకు ప్రాధాన్యం లేదు. కొన్ని సాగదీత సీన్లు, రక్తపాతం మైనస్.
రేటింగ్: 3.25/5

News March 19, 2026

కొత్తగా మరో 5 రకాల వైకల్యాలకు ‘సదరం’

image

AP: కొత్తగా 5 రకాల వైకల్యాలకు సదరం సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. యాసిడ్ దాడి బాధితులు, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజార్డర్, అభ్యాస వైకల్యం, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్(ASD), బహుళ వైకల్యంను జాబితాలో చేర్చినట్లు చెప్పారు. ఇక సదరం సర్టిఫికెట్లు డిజిటల్ విధానంలోనే ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఈ నెల 25వ తేదీ స్లాట్ బుకింగ్, 30వ తేదీ నుంచి వైద్యపరీక్షలు ప్రారంభమవుతాయని వివరించారు.

News March 19, 2026

ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

image

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్‌లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.