News May 4, 2024

టీ20 ప్రపంచకప్‌లలో అంతంతమాత్రమే.. ఈసారి ఏం చేస్తారో?

image

వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్లలో విరుచుకుపడే రోహిత్ శర్మ.. టీ20 ప్రపంచకప్‌లలో విఫలం అవుతున్నారు. ఇప్పటివరకు రోహిత్ 8 టీ20 WCలు ఆడారు. 2007లో 88, 2009లో 131, 2010లో 84, 2012లో 82, 2014లో 200, 2016లో 88, 2021లో 174, 2022లో 116 రన్స్ చేశారు. మరి వచ్చే నెల నుంచి వెస్టిండీస్, అమెరికాల్లో జరిగే పొట్టి క్రికెట్ టోర్నమెంట్లో టీమ్ ఇండియా కెప్టెన్ రాణించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Similar News

News March 11, 2026

అకౌంట్లలోకి డబ్బులు.. ఇలా చేయండి

image

ఎల్లుండి(ఈ నెల 13న) రైతుల <<19350621>>ఖాతాల్లో<<>> పీఎం కిసాన్ డబ్బులు జమ కానున్నాయి. అయితే అర్హులైన అన్నదాతలు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సూచించారు. పీఎం కిసాన్ <>పోర్టల్‌లో<<>> ఈ-కేవైసీ ఆప్షన్ సెలక్ట్ చేసుకొని ఓటీపీ/బయోమెట్రిక్‌ ద్వారా ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. ఫేస్ అథెంటికేషన్ మొబైల్ యాప్‌తోనూ సబ్మిట్ చేయొచ్చని పేర్కొన్నారు.

News March 11, 2026

చిన్నస్వామి నుంచే IPL కిక్ స్టార్ట్

image

గతేడాది తొక్కిసలాట తర్వాత బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. కానీ ఇప్పుడు IPL-2026 అక్కడి నుంచే కిక్ <<19356627>>స్టార్ట్<<>> కానుండటం గమనార్హం. తొలి మ్యాచ్‌లో RCB-SRH తలపడనున్నాయి. ఇది ఒక రకంగా RCB అభిమానులకు శుభవార్తే. నిర్వాహకులు సరైన భద్రతా చర్యలు చేపట్టాలని, ఫ్యాన్స్ కూడా హద్దులు దాటకుండా ఆటను ఆస్వాదించాలని క్రీడా విశ్లేషకులు సూచిస్తున్నారు.

News March 11, 2026

భర్తతో విడాకులు.. భరణం ఆశించని హన్సిక

image

ఇటీవల సెలబ్రిటీల విడాకులు అనగానే భరణం గురించే చర్చ జరుగుతుంది. కానీ తాజాగా భర్త సోహైల్ నుంచి <<19354762>>డివోర్స్<<>> తీసుకున్న హీరోయిన్ హన్సిక ఎలాంటి భరణం ఆశించలేదు. మనస్పర్ధల కారణంగా ఇరువురి అంగీకారంతో విడిపోతున్నట్లు కోర్టుకు తెలిపారు. చిన్నచిన్న గొడవల కారణంగానే హన్సిక-సోహైల్ మధ్య దూరం పెరిగి విడిగా జీవించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ముంబైలోని బాంద్రా కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది.