News February 2, 2026
T20WC వార్మప్ మ్యాచ్.. భారత్ భారీ స్కోర్

ICC మెన్స్ T20WC వార్మప్ మ్యాచ్‌లో భారత్-A జట్టు అదరగొట్టింది. USAపై 238/3 స్కోర్ చేసింది. నారాయణ్ జగదీశన్ సెంచరీ(55 బంతుల్లో 104) చేయగా, ప్రియాంశ్ ఆర్య 28(13 B), తిలక్ వర్మ 38(24 B), బదోనీ 60*(26 B) పరుగులతో విరుచుకుపడ్డారు. భారత ఇన్నింగ్స్‌లో 12 సిక్సర్లు, 23 ఫోర్లు నమోదయ్యాయి. అటు USA టీమ్ 9 మంది బౌలర్లను ప్రయోగించినా ప్రభావం చూపలేకపోయింది.
Similar News
News February 14, 2026
పెట్టుబడి రాయితీ కింద రూ.310 కోట్లు: అచ్చెన్న

APలో భూసార పరీక్షలు నిర్వహించి 6 లక్షల మంది రైతులకు ఫలితాల పత్రాలు అందించామని బడ్జెట్ సందర్భంగా అసెంబ్లీలో మంత్రి అచ్చెన్న తెలిపారు. ‘పొలం పిలుస్తోంది’తో 18 లక్షల మంది రైతులకు విస్తరణ సేవలు అందించామన్నారు. బడ్జెట్‌లో పెట్టుబడి రాయితీ కింద రూ.310 కోట్లు, యాంత్రీకరణలో 50% రాయితీ కోసం రూ.136 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. 80% రాయితీతో రూ.90.4 కోట్లతో 1,130 డ్రోన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
News February 14, 2026
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. నెలాఖరులో అకాల వర్షాలు!

TG: రాష్ట్రంలో శీతాకాలం దాదాపుగా ముగిసింది. ఎండలు, ఉక్కపోతలు మొదలయ్యాయి. కొన్ని రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలు, నైట్ టెంపరేచర్లు 17-19 డిగ్రీలు ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. క్రమంగా ఉష్ణోగ్రతల్లో భారీ పెరుగుదల ఉంటుందంటున్నారు. అలాగే FEB 25-28 మధ్య ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురుస్తాయని పేర్కొంటున్నారు.
* మీ ఏరియాల్లో ఎండలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News February 14, 2026
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 5,138 పోస్టులు.. అప్లై చేశారా?

పంజాబ్ నేషనల్ బ్యాంక్ 5,138 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ అర్హత గలవారు FEB 24 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలి. వయసు 20- 28 ఏళ్ల మధ్య ఉండాలి(రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు). రాత పరీక్ష, DV ద్వారా ఎంపిక చేస్తారు. రూరల్, అర్బన్ ప్రాంతంలో నెలకు రూ.12,300, మెట్రో ప్రాంతంలో రూ.15000 చెల్లిస్తారు. సైట్: pnb.bank.in


