News July 8, 2024
T20WC: ఒక్కో క్రికెటర్‌కు ₹5కోట్లు
టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు BCCI ₹125కోట్లు నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని పంచగా 15మంది ఆటగాళ్లు, కోచ్ ద్రవిడ్‌కి ఒక్కొక్కరికి ₹5కోట్లు రానున్నాయి. మిగిలిన కోచ్‌లు ₹2.5కోట్ల చొప్పున అందుకుంటారు. బ్యాక్‌రూమ్ స్టాఫ్ తలా ₹2కోట్లు, సెలెక్షన్ కమిటీలోని సభ్యులు, రిజర్వ్ ప్లేయర్లు ₹కోటి చొప్పున అందుకుంటారు. వాంఖడేలో ఇప్పటికే దీనికి సంబంధించిన చెక్కును BCCI జట్టుకు అందించింది.
Similar News
News January 18, 2025
నేను నేరం చేయలేదు: కోర్టులో సంజయ్
కోల్‌కతా హత్యాచార ఘటనలో దోషిగా కోర్టు నిర్ధారించిన <<14530358>>సంజయ్ రాయ్<<>> తాను నిర్దోషిని అని వాదించాడు. ఈ రోజు కోర్టు తీర్పు వెల్లడించే ముందు జడ్జితో ‘నేను ఈ నేరం చేయలేదు’ అని చెప్పాడు. గతంలో కూడా ఇతడు ఇదే తరహా కామెంట్లు చేశాడు. అటు అతడు ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నామని రాయ్ కుటుంబం పేర్కొంది. కోల్‌కతాలోని శంభునాథ్ స్లమ్‌లో ఒక గదిలో ఉండే వీరి కుటుంబం.. పోరాడే శక్తి సైతం తమకు లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
News January 18, 2025
పవన్ కళ్యాణ్ అభిమానులకు మళ్లీ నిరాశే?
హీరో నితిన్, వెంకీ కుడుముల కాంబోలో తెరకెక్కుతోన్న ‘రాబిన్ హుడ్’ మార్చి 28న విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు షాక్ అవుతున్నారు. ఆయన నటిస్తోన్న ‘హరిహర వీరమల్లు’ సైతం అదేరోజున విడుదలకానుంది. నితిన్ మూవీ అప్డేట్‌తో HHVM వాయిదా పడుతుందనే వార్తలొస్తున్నాయి. అదే జరిగితే రాబిన్ హుడ్‌తో పాటు VD12, మ్యాడ్ స్క్వేర్ కూడా ఇదే తేదీలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.
News January 18, 2025
ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార కేసులో తీర్పు వెల్లడి
యావత్ దేశం చలించిన <<13905124>>అభయ<<>> హత్యాచార కేసులో సీల్దా కోర్టు తీర్పు వెల్లడించింది. సంజయ్ రాయ్‌ను దోషిగా తేలుస్తూ తీర్పిచ్చింది. కలకత్తా RG కర్ మెడికల్ కాలేజ్‌లో ట్రైనీ డాక్టర్ 2024 AUG 9న దారుణ అత్యాచారం, హత్యకు గురైంది. నిర్భయ తీవ్రతను తలపించేలా జరిగిన ఈ దుశ్చర్యపై CBI దర్యాప్తు జరిపి OCT 7న ఛార్జిషీట్ వేసింది. డైలీ విచారణ అనంతరం నేడు దోషిగా తేల్చిన జడ్జి అనిర్బన్ దాస్ సోమవారం శిక్ష ఖరారు చేయనున్నారు.