News June 6, 2024
T20WC: ఒమన్‌పై ఆస్ట్రేలియా గెలుపు

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఒమన్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కంగారూ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 రన్స్ చేసింది. ఛేదనలో ఒమన్ జట్టు 125/9కే పరిమితమైంది. దీంతో ఆస్ట్రేలియా 39 రన్స్ తేడాతో గెలిచింది. ఆసీస్ బ్యాటర్లు భారీ స్కోర్ చేయకుండా అడ్డుకోగలిగిన ఒమన్ ప్రత్యర్థి బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోయింది.
Similar News
News January 16, 2026
బ్యారేజీని ప్రారంభించిన సీఎం రేవంత్

TG: గోదావరి నదిపై నిర్మల్ జిల్లాలో నిర్మించిన బ్యారేజీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మామడ మం. పొన్కల్ గ్రామంలోని ఆ బ్యారేజీ గేట్లు ఓపెన్ చేసి యాసంగికి నీరు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అంతకుముందు ఆదిలాబాద్ జిల్లాలోని చనాక-కొరాటా పంప్ హౌస్‌ను సీఎం ప్రారంభించారు.
News January 16, 2026
110 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పుదుచ్చేరిలోని <
News January 16, 2026
ఆయుధం పట్టకుండా జ్ఞాన యుద్ధం చేసిన విదురుడు

మహాభారతంలో విదురుడు ఆయుధం పట్టకుండానే జ్ఞాన యుద్ధం చేశారు. కత్తి కంటేమాట పదునైనదని నమ్మి, తన వాక్చాతుర్యంతో కురువంశాన్ని కాపాడేందుకు నిరంతరం శ్రమించారు. ధృతరాష్ట్రుడి అంధకార బుద్ధికి దిక్సూచిగా ఉంటూ, దుర్యోధనుడి దురాలోచనలను ముందే పసిగట్టి హెచ్చరించారు. ధర్మం వైపు నిలబడి ఆయన చేసిన ప్రతి సూచన అహంకారంపై సాగిన భీకర పోరాటం. దుర్మార్గంపై ధర్మం సాధించే నిశ్శబ్ద గెలుపును విదురుని జీవితం మనకు చెబుతుంది.


