News June 29, 2024
T20WC ఫైనల్: సౌతాఫ్రికా టార్గెట్ 177 రన్స్

T20WC ఫైనల్లో భారత్ 20 ఓవర్లలో 176/7 స్కోర్ చేసింది. కోహ్లీ 59 బంతుల్లో 76(6 ఫోర్లు, 2 సిక్సులు), అక్షర్ 31 బంతుల్లో 47(4 సిక్సులు, ఒక ఫోర్) పరుగులతో అదరగొట్టారు. శివమ్ దూబే 27, రోహిత్ 9, సూర్య 3, పంత్ 0, హార్దిక్ 5*, జడేజా 2 రన్స్ చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్, నోర్ట్జే చెరో 2 వికెట్లు, రబడ, జాన్సెన్ చెరో వికెట్ పడగొట్టారు. విజయం కోసం దక్షిణాఫ్రికా 177 రన్స్ చేయాలి.
Similar News
News December 8, 2025
చలికాలంలో గర్భిణులు ఏం తినాలంటే?

వాతావరణం చల్లగా ఉండటం, జీర్ణ క్రియలు నెమ్మదిగా ఉండటం వల్ల ఈ కాలంలో పోషకాహార లోపం ఏర్పడుతుంది. గర్భిణుల్లో ఈ లోపం రాకుండా ఉండాలంటే డైట్లో కొన్ని ఆహారాలు చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్, విటమిన్లు, ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు. వీటికోసం చిలగడ దుంప, ఆరెంజ్, ద్రాక్ష, నిమ్మ, దానిమ్మ, రేగిపండ్లు వంటివి తినాలంటున్నారు.
News December 8, 2025
‘వందేమాతరం’.. చర్చ ఈ అంశాలపైనే!

ఇవాళ పార్లమెంటులో జాతీయ గేయం ‘వందేమాతరం’పై చర్చ జరగనుంది. ఇప్పటివరకు వెలుగులోకి రాని అంశాలను చర్చలో వెల్లడించే అవకాశం ఉంది. బంకించంద్ర ఛటర్జీ రాసిన ఈ గీతం 1875 నవంబర్ 7న లిటరరీ జర్నల్ బంగదర్శన్లో ప్రదర్శించారు. 1882లో తన నవల ఆనందమఠ్లో దీనిని భాగం చేశారు. 1937లో ఈ గీతం నుంచి కీలక చరణాలను కాంగ్రెస్ తొలగించిందని మోదీ ఆరోపించారు. దీంతో ఇవాళ ఏ అంశాలను చర్చలో ప్రస్తావిస్తారోనని ఆసక్తికరంగా మారింది.
News December 8, 2025
మైసూరు పప్పు మాంసాహారమా?

పూజలు, వ్రతాల సమయంలో మైసూరు పప్పు తినకూడదంటారు. దీన్ని మాంసాహారంగా కూడా కొందరు భావిస్తారు. ఇందులో బద్ధకాన్ని కలిగించే తామస గుణాలుండటం అందుకు తొలి కారణం. అలాగే ఓ రాక్షసుడి రక్తం బొట్టు నుంచి ఈ పప్పు పుట్టిందని కొందరు పండితులు పేర్కొంటారు. పాల సముద్రాన్ని చిలకగా వచ్చిన అమృతాన్ని దొంగచాటుగా తాగిన సర్భాను తలను విష్ణు సుదర్శన చక్రంతో ఖండించాడట. ఆ రక్తపు చుక్కలు పడిన చోట ఇవి మొలిచాయని నమ్ముతారు.


