News April 28, 2024
T20WC: మే 1న భారత జట్టు ప్రకటన?
టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత జట్టు ఎంపిక తుదిదశకు చేరుకుంది. ఈ మేరకు ఈరోజు బోర్డు సభ్యులతో కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్‌శర్మ సమావేశం అయ్యారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జట్టు ఎంపికపై తీవ్రంగా చర్చించింది. మే 1న జట్టును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జట్టుకు ఎంపికైన ఆటగాళ్లు మే 22న న్యూయార్క్‌కు బయలుదేరనున్నట్లు సమాచారం.
Similar News
News January 18, 2025
త్వరలో 3,260 పోస్టుల భర్తీ!
TG: విద్యుత్ శాఖలో కొలువుల జాతర ప్రారంభం కానుంది. త్వరలోనే 3,260 పోస్టులు భర్తీ చేయాలని డిస్కమ్‌లు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్పీడీసీఎల్-వరంగల్‌లో 2,212 జేఎల్ఎం, 30 సబ్ ఇంజినీర్, 18 అసిస్టెంట్ ఇంజినీర్, ఎస్పీడీసీఎల్ లో 600 JLM, 300 సబ్ ఇంజినీర్, 100 AE పోస్టులను భర్తీ చేసే అవకాశముంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ ఖాళీలను భర్తీ చేయనుందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు.
News January 18, 2025
నేటి నుంచి U19 మహిళల టీ20 WC
ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ మలేషియా వేదికగా ఇవాళ్టి నుంచి జరగనుంది. మొత్తం 16 జట్లను 4 గ్రూపులుగా విభజించారు. మలేషియా, శ్రీలంక, వెస్టిండీస్, భారత్ గ్రూప్-ఏలో ఉన్నాయి. టీమ్ ఇండియా తన తొలి మ్యాచును రేపు WIతో ఆడనుంది. నేడు తొలి మ్యాచు ఆస్ట్రేలియా, స్కాట్లాండ్ మధ్య జరగనుంది. ఈ మ్యాచులను స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌లో చూడవచ్చు. 2023లో జరిగిన తొలి ఎడిషన్‌లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
News January 18, 2025
ఢిల్లీ ఎన్నికలు: అన్ని పార్టీలదీ అదే దారి!
తాము ఉచితాలకు వ్యతిరేకమని చెప్పుకునే బీజేపీ సైతం ఢిల్లీ ఎన్నికల కోసం తాయిలాలు ప్రకటించింది. ప్రతి నెల మహిళలకు రూ.2,500, గర్భిణులకు రూ.21,000 ఇస్తామని జేపీ నడ్డా ప్రకటించారు. మరోవైపు మహిళలకు కాంగ్రెస్ రూ.2,500, ఆప్ రూ.2,100 ఇస్తామని హామీలు ఇచ్చాయి. ఇలా దేశ రాజధానిలో మహిళల ఓట్ల కోసం పార్టీలన్నీ పోటీ పడుతున్నాయి. ఈ ఉచితాల హామీలపై మీ కామెంట్?