News June 13, 2024

T20WC: సూపర్-8లో భారత్-ఆసీస్ పోరు

image

టీ20 వరల్డ్ కప్‌లో యూఎస్ఏపై విజయంతో టీమ్ ఇండియా సూపర్-8కు దూసుకెళ్లింది. కాగా సూపర్-8లో ఆసీస్‌-భారత్ జూన్ 24న తలపడనున్నాయి. ఆస్ట్రేలియా ఇప్పటికే సూపర్-8 చేరుకుంది. ఈ నెల 20న గ్రూప్ Cలోని అఫ్గానిస్థాన్ లేదా వెస్టిండీస్, 22న గ్రూప్ Dలోని బంగ్లాదేశ్‌ లేదా నెదర్లాండ్స్‌ జట్లతో టీమ్ ఇండియా మ్యాచ్‌లు ఆడే ఛాన్స్ ఉంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

Similar News

News December 30, 2024

రేపు పవన్ కీలక సమావేశం

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు సాయంత్రం అధికారులు, ఉద్యోగులతో కీలక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై ఇటీవల జరుగుతున్న దాడుల వ్యవహారంపై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో చర్చించనున్నారు. ఉద్యోగుల భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కార్యాలయాల్లో ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలా? అనే అంశాలపై ఉద్యోగుల అభిప్రాయం తెలుసుకోనున్నారు.

News December 30, 2024

మంత్రి అచ్చెన్నాయుడు గొప్ప మనసు

image

AP: న్యూఇయర్ వేడుకల సందర్భంగా తనను కలిసే అభిమానులు బొకేలు, పూలదండలు, శాలువాలు తీసుకురావద్దని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. వాటికి బదులు పుస్తకాలు, పెన్నులు తీసుకురావాలని ఆయన కోరారు. తనకు అభిమానులు నిండు మనసుతో చెప్పే శుభాకాంక్షలు చాలని పేర్కొన్నారు. పెన్నులు, పుస్తకాలు ఇస్తే పేద విద్యార్థులకు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ విధంగానైనా పేదలను ఆదుకోవచ్చని పేర్కొన్నారు.

News December 30, 2024

AP సీఎస్‌గా విజయానంద్ ఖరారు

image

AP కొత్త సీఎస్‌గా విజయానంద్ పేరు ఖరారైంది. ఆయన్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ నీరభ్ కుమార్ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుండటంతో ప్రభుత్వం కొత్త సీఎస్‌ను నియమించింది. కాగా 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి అయిన విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.