News June 1, 2024

T20WC: అత్యధిక POTMలు కోహ్లీవే!

image

టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్న ఘనత టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పేరిట ఉంది. విరాట్ ఇప్పటివరకు 7 సార్లు POTM అందుకున్నారు. ఆయన తర్వాత మహేల జయవర్ధనే (5), క్రిస్ గేల్ (5), షేన్ వాట్సన్ (5), షాహిద్ అఫ్రీది (4), తిలకరత్నే దిల్షాన్ (4), డివిలియర్స్ (4) ఉన్నారు.

Similar News

News November 25, 2025

తీవ్ర అల్పపీడనం.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

image

AP: మలక్కా జలసంధి పరిసరాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడి మరో 48 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 29న రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో బారీ వర్షాలు కురుస్తాయని.. 30వ తేదీన ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

News November 25, 2025

ఈ దిగ్గజ మహిళా క్రికెటర్ గురించి తెలుసా?

image

ప్రస్తుత భారత మహిళా క్రికెట్ టీమ్ సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. అయితే దీని వెనక డయానా ఎడుల్జీ పాత్ర ఎంతో ఉంది. 50 సంవత్సరాలకుపైగా క్రికెటర్‌గా, అడ్మినిస్ట్రేటర్‌గా ఎడుల్జీ భారత క్రికెట్‌కు సేవలు అందించారు. ఈమెను స్ఫూర్తిగా తీసుకుని అప్పట్లో చాలామంది అమ్మాయిలు క్రికెట్‌కు ఆకర్షితులై ఆటలోకి అడుగుపెట్టారు. ఎడమచేతి వాటం స్పిన్నర్ అయిన డయానా భారత్ తరఫున 54 మ్యాచ్‌లు ఆడి 109 వికెట్లు పడగొట్టారు.

News November 25, 2025

TG TET.. నేటి నుంచి ఎడిట్ ఆప్షన్

image

TG: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) అప్లికేషన్ గడువు ఈ నెల 29తో ముగియనుంది. ఇప్పటివరకు 1,26,085 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎడిట్ ఆప్షన్ నేటి నుంచి డిసెంబర్ 1 వరకు అందుబాటులో ఉండనుంది. సర్వీసులో ఉన్న టీచర్లూ టెట్‌లో అర్హత సాధించాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈసారి దరఖాస్తుల సంఖ్య పెరిగింది.
వెబ్‌సైట్: <>https://tgtet.aptonline.in/tgtet/<<>>