News June 20, 2024
T20WC: అఫ్గాన్‌తో మ్యాచ్.. సిరాజ్‌పై వేటు?

టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌పై వేటు పడనున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో చైనామన్ కుల్దీప్ యాదవ్‌కు చోటివ్వాలని మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు సమాచారం. మ్యాచ్ జరిగే కెన్సింగ్టన్ ఓవల్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశాలు ఉండటంతో ఈ మార్పు చేయనున్నట్లు టాక్. కాగా ఈ మెగా టోర్నీలో కుల్దీప్ ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
Similar News
News December 5, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇస్రో-<
News December 5, 2025
ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.
News December 5, 2025
పీజీ సెట్ రాయకపోయినా అడ్మిషన్

AP: MA, M.Sc, M.Com కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది పీజీ సెట్ అర్హతను మినహాయించింది. పీజీ సెట్ అర్హత సాధించకపోయినా, సెట్ రాయకపోయినా స్పాట్ కోటా కింద అడ్మిషన్లు చేపట్టేందుకు అవకాశం కల్పించింది. వర్సిటీలు, కాలేజీల్లో మిగిలిన కన్వీనర్ కోటా సీట్లను ఈ స్పాట్ కోటా కింద ఫిల్ చేయాలని ఆదేశించింది. ఈ కోటాలో చేరే విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ వర్తించదు.


