News June 14, 2024

T20WC: ఇలా జరిగితే పాకిస్థాన్ ఇంటికే

image

పాకిస్థాన్ జట్టులో సూపర్-8 గుబులు నెలకొంది. ఆ జట్టు సూపర్-8కు అర్హత సాధించాలంటే ఐర్లాండ్‍తో మ్యాచ్‌లో భారీ విజయం సాధించాలి. అలాగే ఐర్లాండ్‍తో అమెరికా ఓడాలి. ప్రస్తుతం ఫ్లోరిడాలో భారీ వర్షాలు పడుతుండటంతో ఈ మ్యాచ్‍ల్లో ఏ ఒక్కటి రద్దయినా పాక్ టోర్నీ నుంచి ఇంటి బాట పడుతుంది. అప్పుడు అమెరికా త‌దుప‌రి ద‌శ‌కు చేరుకుంటుంది. నేడు యూఎస్ఏ-ఐర్లాండ్‌, జూన్ 16న ఐర్లాండ్‌-పాక్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచులు జ‌ర‌గనున్నాయి.

Similar News

News January 15, 2025

EX కానిస్టేబుల్ అక్రమాస్తులు రూ.500 కోట్లు.. భోపాల్‌లో పొలిటికల్ వార్

image

MP భోపాల్‌లో 2024 DEC 19న ఓ కార్ నుంచి 52KGల గోల్డ్, ₹10Cr నగదును IT అధికారులు సీజ్ చేశారు. ఈ మొత్తం RTO మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మదిగా గుర్తించి ఇంట్లో సోదాలు చేయగా ₹500-700Cr అక్రమాస్తులు బయటపడ్డాయి. పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. BJP ప్రభుత్వంలో అవినీతికి ఇదే నిదర్శనమని INC విమర్శిస్తోంది. అయితే 15 నెలల కమల్‌నాథ్ సర్కార్ కరప్షన్‌కు మారుపేరని కమల నేతలు కౌంటరిస్తున్నారు.

News January 15, 2025

‘కుంభమేళా’పై స్టీవ్ జాబ్స్ లేఖ.. వేలంలో రూ.4.32 కోట్లు

image

భారత్‌లో జరిగే మహాకుంభమేళా అంటే యాపిల్ కో ఫౌండర్, దివంగత స్టీవ్ జాబ్స్‌కు ఎంతో ఇష్టం. ఆయన 19 ఏళ్ల వయసు(1974)లో తన ఆధ్యాత్మిక, ఆత్మ పరిశీలనతోపాటు కుంభమేళాను సందర్శించాలనే ఆకాంక్షను ప్రస్తావిస్తూ స్నేహితుడు టిమ్ బ్రౌన్‌కు లేఖ రాశారు. తర్వాత స్టీవ్ భారత్‌లో దాదాపు 7 నెలలు గడిపారు. 50 ఏళ్ల కిందటి ఈ లెటర్‌ను వేలం వేయగా దాదాపు రూ.4.32 కోట్లు పలికింది. తాజాగా ఆయన సతీమణి పావెల్ కుంభమేళాకు వచ్చారు.

News January 15, 2025

అందుకే కేజ్రీవాల్‌కు మద్దతు: అఖిలేశ్ యాదవ్

image

ఢిల్లీలో BJPని ఓడించే స‌త్తా ఆప్‌కు మాత్ర‌మే ఉంద‌ని, అందుకే ఆ పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్టు అఖిలేశ్ యాద‌వ్ తెలిపారు. BJPకి వ్య‌తిరేకంగా పోరాడే ప్రాంతీయ పార్టీల‌కు INDIA కూట‌మి నేత‌లు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని పిలుపునిచ్చారు. ఇండియా కూట‌మి ఏర్ప‌డిన‌ప్పుడే ప్రాంతీయ పార్టీలు బ‌లంగా ఉన్న చోట వాటికే అధిక ప్రాధాన్యం ఇవ్వాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. కూటమి పార్టీలు SP, TMC, NCP(SP)లు ఆప్‌కు మద్దతు ప్రకటించాయి.