News June 5, 2024

T20WC: ఓపెనర్లుగా రోహిత్-కోహ్లీ!

image

ఇవాళ రాత్రి 8 గంటలకు ఐర్లాండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో రోహిత్‌తో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. స్లో పిచ్ కావడంతో జైస్వాల్ బెంచ్‌కే పరిమితం కావొచ్చని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు శివమ్ దూబే, పంత్‌కు తుది జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తోంది.
భారత తుది జట్టు (అంచనా): రోహిత్‌, కోహ్లీ, సూర్యకుమార్, పంత్, దూబే, హార్దిక్, జడేజా, అక్షర్, కుల్‌దీప్, బుమ్రా, అర్ష్‌దీప్

Similar News

News November 28, 2025

ఇతిహాసాలు క్విజ్ – 80

image

ఈరోజు ప్రశ్న: ఉప పాండవులను చంపింది ఎవరు? ఆ వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడటానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 28, 2025

అధిక పాలనిచ్చే ‘జఫరాబాది’ గేదెలు

image

జఫరాబాది జాతి గేదెలు గుజరాత్‌కు చెందినవి. వీటి కొమ్ములు మెలి తిరిగి ఉంటాయి. పొదుగు విస్తారంగా ఉంటుంది. నలుపు రంగులో ఉండే వీటి శరీర బరువు దాదాపు 460KGలు ఉంటుంది. ఇవి మొదటిసారి 36-40 నెలలకు ఎదకు వస్తాయి. 48-51 నెలల వయస్సులో మొదటి దూడకు జన్మనిస్తాయి. రోజుకు 15-18 లీటర్ల చొప్పున పాడి కాలంలో 2,336 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తాయి. వెన్న 9-10% వరకు వస్తుంది. ఒక్కో గేదె ధర రూ.80K-రూ.లక్ష వరకు ఉంటుంది.

News November 28, 2025

నేషనల్ ఫొరెన్సిక్ సైన్సెస్ వర్సిటీలో ఉద్యోగాలు

image

<>నేషనల్ <<>>ఫొరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ 27 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 4 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ, పీజీ, MCA, ME, M.TECH, LLM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.500. డిసెంబర్ 8, 9, 10, 11 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://www.nfsu.ac.in