News April 29, 2024
T20WC: కోహ్లీ ఉండాల్సిందేనన్న రోహిత్!

టీ20 ప్రపంచకప్ జూన్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఎంపికపై సెలక్టర్లు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అయితే.. జట్టులో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఉండాల్సిందేనని కెప్టెన్ రోహిత్శర్మ సెలక్షన్ కమిటీకి తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. అతడి స్వభావం ఈ మెగా టోర్నీలో టీమ్ ఇండియాకు కలిసి వస్తుందని రోహిత్ చెప్పారట. మే 1తో జట్టు ప్రకటన గడువు ముగియనుంది. దీంతో ఈరోజు లేదా రేపు జట్టు ప్రకటించవచ్చు.
Similar News
News November 19, 2025
అన్నదాత సుఖీభవ రెండో విడత.. రూ.3,135 కోట్లు జమ

AP: పీఎం కిసాన్ -అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. కడప జిల్లా పెండ్లిమర్రిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి అర్హులైన 46,85,838 రైతుల అకౌంట్లలో రూ.3,135 కోట్లను జమ చేశారు. PM కిసాన్ కింద రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ రెండో విడత కింద రూ.5వేలు మొత్తం రూ.7వేలు చొప్పున రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయి.
News November 19, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 9

50. జ్ఞానం అంటే ఏమిటి? (జ.మంచి చెడ్డల్ని గుర్తించగలగడం)
51. దయ అంటే ఏమిటి? (జ.ప్రాణులన్నింటి సుఖం కోరడం)
52. అర్జవం అంటే ఏమిటి? (జ.సదా సమభావం కలిగి ఉండడం)
53. సోమరితనం అంటే ఏమిటి? (జ.ధర్మకార్యములు చేయకుండుట)
54. దు:ఖం అంటే ఏమిటి? (జ.అజ్ఞానం కలిగి ఉండటం)
55. ధైర్యం అంటే ఏమిటి? (జ.ఇంద్రియ నిగ్రహం)
<<-se>>#YakshaPrashnalu<<>>
News November 19, 2025
PM కిసాన్ 21వ విడత.. రూ.18 వేల కోట్లు జమ

దేశ వ్యాప్తంగా అన్నదాతలకు రబీ పెట్టుబడి సాయం కింద PM కిసాన్ 21వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన కార్యక్రమంలో.. దేశ వ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేలు చొప్పున రూ.18వేల కోట్లను ప్రధాని జమ చేశారు. ఇప్పటి వరకు PM కిసాన్ 20 విడతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా నిధులను అన్నదాతల అకౌంట్లలో కేంద్రం జమ చేసింది.


