News June 19, 2024

T20WC: యూఎస్ఏపై దక్షిణాఫ్రికా విజయం

image

T20 వరల్డ్ కప్ సూపర్-8 తొలి మ్యాచులో యూఎస్ఏపై దక్షిణాఫ్రికా 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన SA 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. డికాక్(74), మార్క్రమ్(46) రాణించారు. చేధనలో యూఎస్ఏ 176 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ గౌస్(80) చివరి వరకు పోరాడినా ప్రయోజనం లేకపోయింది. దక్షిణాఫ్రికా బౌలర్ రబడ 3 వికెట్లు తీశారు.

Similar News

News April 4, 2026

నేను గంగూలీని కాదు.. కానీ బెంగాలీనే: లియాండర్ పేస్

image

తాను బెంగాలీ కాదంటూ వస్తున్న విమర్శలపై టెన్నిస్ దిగ్గజం, బీజేపీ నేత లియాండర్ పేస్ ఘాటుగా స్పందించారు. ‘నువ్వు బెంగాలీనేనా’ అని ఎవరైనా అడిగితే బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా పేరు గంగూలీ కాకపోవచ్చు. కానీ నేను బెంగాలీనే. మా నాన్నది పోర్చుగీస్ కావచ్చు. నేను ఈ దేశానికి చెందిన వాడినే. కోల్‌కతాలోనే పుట్టాను. సౌత్ క్లబ్‌లో నా టెన్నిస్ జర్నీ మొదలైంది’ అని చెప్పుకొచ్చారు.

News April 4, 2026

15వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్!

image

త్వరలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) CGL-2026 నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు నేషనల్ మీడియా తెలిపింది. దాదాపు 15వేల అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్), ఎస్సై, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ తదితర గ్రూప్-B, C పోస్టులు ఉన్నాయి. దీనికి డిగ్రీ అర్హత ఉండాలి. నోటిఫికేషన్ విడుదల అయ్యాక దరఖాస్తు తేదీలు వెల్లడించనున్నారు.

News April 4, 2026

ప్రేమ విఫలమై పెళ్లి నిరాకరిస్తే నేరం కాదు: హైకోర్టు

image

తెలంగాణ హైకోర్టు ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది. ప్రేమించి ఆ పిదప పెళ్లికి నిరాకరించడం అన్ని సందర్భాల్లోనూ నేరం/మోసం కిందకు రాదని, కేవలం వాగ్దాన ఉల్లంఘన మాత్రమేనని స్పష్టం చేసింది. పెద్దపల్లి జిల్లా పొట్యాలకు చెందిన సంతోష్ ఓ యువతితో ఐదేళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. తర్వాత పెళ్లి చేసుకోలేదనే కారణంతో ఆమె అతనిపై కేసు పెట్టింది. దీనిపై సంతోష్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు కేసును కొట్టేసింది.